BREAKING : GST ఎఫెక్ట్, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్?

వివాదాలతో ఫ్రెండ్షిప్ చేసే అగ్ర దర్శకుడు రాం గోపాల్‌ వర్మ ఈ రోజు ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాఋ. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ ఫిలిం కి సంబంధించి హైదరాబాద్ సిసీఎస్ పోలీసులు మొదట నోటీసు ఇచ్చాక తాను షూటింగ్ లో బిజీ ఉండి రాలేకపోతున్నా అని, మరొక సారి నోటీసులు ఇస్తే విచారణకు వస్తా అని సమాధానం ఇచ్చినట్టు గ అతేలుస్తుంది. దీనితో మరొక సారి సి సి ఎస్ పోలీసులు

నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు అందుకున్న వర్మ ఈ రోజు విచారణ కు హాజరు అయ్యారు. దాదాపు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి విచారణ సాగుతుంది. జీఎస్టీ తో తీవ్ర దుమారం రేపిన వర్మ ఆ సమయంలో ఒక ఛానల్ డిస్కషన్ లో భాగం గా సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను దేవి తో పాటు అందరు తప్పు పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. అసలు సామాజిక ఖాతాల్లో ఉంచిన మియా మాల్కోవ ఫోటోలు ఎక్కడివి? భారత్ లో షూట్ చెయ్యకపోతే ఇక్కడ చట్టాలు వర్తించవని ఎలా అనుకున్నారు? దేవి మీద అంత తీవ్ర వ్యాఖ్యలు దేనికి చేసారు? తదితర ప్రశ్నలు వర్మ ని అడిగినట్టు గ తెలుస్తుంది.అశ్లీలతతో పాటు మహిళలను కించపర్చారంటూ వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు పలు మహిళా సంఘాలతో పాటు దేవీ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వర్మపై సీసీఎస్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలంటూ వర్మకు నోటీసులు జారీ చేశారు. లాయర్‌తో పాటు సీసీఎస్‌కు వచ్చిన వర్మను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీసీఎస్ ముందు ఉత్కంఠ వాతారణం నెలకొంది. ఇదిలా ఉంటె సి సి ఎస్ పోలీసులు కూడా న్యాయ నిపుణులను సంప్రదించి ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టాలి? ఎటువంటి సమాధానాలు రప్పించాలి అనే విషయాల మీద పూర్ర్తి స్థాయి హోమ్ వర్క్ చేసినట్టు గా తెలుస్తుంది. ఈ విచారణ మరి కాసేపు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here