కాస్టింగ్ కౌచ్ పై తన తొలి రోజుల అనుభవాలు చెప్పిన రకుల్

Advertisements

సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్‌ అనేది విచ్చల విడిగా మారిందని తాజాగా ఓ టీవీ లో ఛానల్ చర్చ లో యాంకర్ మాట్లాడిన తీరుకు యావత్ సినీ ప్రముఖులు మండి పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేయగా , తాజాగా హైదరాబాద్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెస్‌మీట్ ఏర్పటు చేసి తెలుగు సినిమా పరిశ్రమపైన, హీరోయిన్స్‌పైన అసభ్యకరమైన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇలాంటి నిరసన కార్యక్రమాలను చేపట్టడం ద్వారానే ప్రజలకు విషయం తెలుస్తుందని… టీవీ యాంకర్ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాని తెలిపింది. సెలబ్రిటీలపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం కామన్‌గా మారిందని.. హీరో, హీరోయిన్స్‌ గురించి ఏదిబడితే అది ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారన్నారు. అయితే ఆ టీవీ యాంకర్ హీరోయిన్స్‌ గురించి ఇంత నీచంగా మాట్లాడటం మొదట చూసి నమ్మలేదని.. అయితే మళ్లీ ఆ వీడియో చూశాక షాక్ అయ్యానని తెలిపింది.నా తల్లిదండ్రులకు తెలుగు అర్థం కాదు కాబట్టి ఇలాంటివి వాళ్లు వినలేదు. ఒక వేళ వాళ్లకు తెలుగు వచ్చి ఉండుంటే పరిస్థితి ఏంటి? ఎంత ఆవేదన చెందేవాళ్లు అంటూ ప్రశ్నించింది. నాపై నమ్మకం ఉంచి హైదరాబాద్‌లో నన్ను ఉంచారు. ఇలాంటి విషయాలు వాళ్లకు తెలిస్తే పరిస్థితి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఇంత కాలం అవుతున్న కానీ నన్ను సింగిల్ పర్సన్ కూడా ఇబ్బంది పెట్టలేదు. నా విషయానికి వస్తే తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదనే చెప్తా అని తెలిపింది. తన కెరీర్ తొలి నాళ్ళ నుంచి ఇప్పటి వరకు తనకు ఎటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని, తన వరకు అయితే వరుసగా అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చింది.

ఇక ఈ కార్య క్రమానికి మంచు లక్ష్మి , పరుచూరి బ్రదర్స్ , శివాజీ , డైరెక్టర్ శంకర్ , తమ్మారెడ్డి మొదలగు వారు హాజరయ్యారు.

Advertisements

Leave a Reply