కనకాల ఇంట్లో విషాదం

Advertisements

రాజీవ్ప్ర కనకాల,సుమ కనకాల ఇంట్లో విషాదం జరిగింది. రాజీవ్ము కనకాల తల్లి, ప్రముఖ నటి, నట శిక్షకురాలు కనకాల లక్ష్మీదేవీ ఈ రోజు మరణించారు. హైదరాబాద్ మణికొండలోని సొంత ఇంట్లో గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు.తన కుమారుడు రాజీవ్ కనకాలను ప్రముఖ విలక్షణ నటుడిగా లక్ష్మీదేవే తీర్చిదిద్దారు.లక్ష్మీదేవి భర్త దేవదాస్‌ కనకాల కూడా నటుడు అన్న విషయం తెలిసిందే. భర్త దేవదాస్ కనకాలతో కలిసి లక్ష్మీదేవి తమ నట శిక్షణాలయంలో వందల మంది నటులను తీర్చిదిద్దారు. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రేమబంధం, ఒక ఊరి కథ చిత్రాల్లో నటించారు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతికి అత్తగానూ, కొబ్బరిబోండం సినిమాలో రాజేంద్రప్రసాద్ తల్లి పాత్రలోనూ లక్ష్మీదేవి నటించారు.

లక్ష్మీదేవి, దేవదాస్ కనకాల దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు రాజీవ్, మరొకరు శ్రీలక్ష్మి. లక్ష్మీదేవి తనకు మరో అమ్మ అంటూ రాజీవ్ కనకాల భార్య ప్రముఖ యాంకర్ సుమ పలు ఇంటర్వ్యూల్లో తెలిపిన విషయం విదితమే. బేసిక్‌గా డ్యాన్సర్ అయిన లక్ష్మీదేవి తమ నట శిక్షణాలయంలో ఎంతో మందికి డ్యాన్స్‌లో మెలకువలను నేర్పించేవారు. వీరికి సంబంధించిన ఇనిస్టిట్యూట్స్ చెన్నై, హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ రెండు ఇన్‌స్టిట్యూట్స్ దేవదాస్, లక్ష్మీదేవి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కోడలు కనకాల సుమ యాంకర్‌గా పాపులర్‌. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటక రంగ ప్రముఖులు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisements

Leave a Reply