Talk of the Town : చిన్నమ్మ స్కెచ్ కి విలవిలలాడిన రాష్ట్ర బిజెపి నేతలు

రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబానిది ప్రకాశం జిల్లలో ఒక ప్రస్థానం, బలమైన వర్గం అంత కంటే బలమైన నేపధ్యం కలిసి వచ్చాయి. నందమూరి వారి ఆడపడుచు, దగ్గుబాటి ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లో భర్తని మించి ఎదిగారు, ఏకంగా కేంద్రం లో చక్రం తిప్పారు. తండ్రి ఏ పార్టి ని అయితే వ్యతిరేకించి తెలుగు దేశం స్థాపించారో అదే కాంగ్రెస్ లో ఈవిడ ఒక వెలుగు వెలిగారు. ఈవిడ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, తెలుగు దేశం లో 96 సంక్షోభం తర్వాత ఆ పార్టికి దూరం అయ్యి, ఈ రోజు కి కట్టుబడి ఉండి తన నిబద్దతను ప్రూవ్ చేసారు.

అయితే 2014 లో కాంగ్రెస్ ని మళ్ళి కోలుకోకుండా చేసిన తర్వాత జరిగిన పరిణామాల్లో పురందేశ్వరి గారు బిజెపి లో చేరారు. ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు ఆశీస్సులతో రాజంపేట నుంచి బిజెపి బి-ఫారం మీద పోటి చేసి ఓడిపోయారు. తదనంతర కాలం లో మిత ప్రక్షం లో ప్రతి పక్షం గా ఉంటూ తెలుగు దేశం మీద చంద్ర బాబు మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఇది చేస్తూనే ఒక మాస్టర్ స్కెచ్ రది చేసారు. తనకి ఉన్న అనుభవానికి మామూలు నేత గా ఉండటం కంటే ఒక పదవి ఉంటె బావుండు అని బిజెపి అధిష్టానంతో చర్చలు జరిపారు. రాజ్య సభ నుంచి ఎంపి గా వెళ్తాను అని ఒక ప్రపోజల్ పెట్టారు, ఇది రాష్ట్ర బిజెపి లో దాదాపు ఎవరికీ తెలీదు. ఒక సంవత్సరం క్రితం జరిగింది, ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు పెంచారు.ఇదిలా సాగుతూ ఉండగానే ఎంపి కొస ప్రయత్నాలు సాగాయి, తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో రెండు కేంద్ర మంత్రి పదవులు ఖాళి అవుతాయ్ అని ముందుగానే గెస్ చేసి ఎంపి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసారు, తనలాంటి అనుభవం ఉన్న నేత,సామాజిక వర్గం లెక్కలు అన్ని చెప్పి, నేను మంత్రి అయితే రాష్ట్రం ఒక గాదిలోకి వస్తుందని తెలుగు దేశం డిఫెన్స్ లోకి వెళ్తుందని చెప్పారట. కేంద్రం కూడా

అందుకు ఓకే అని, కర్ణాటక నుంచి ఎంపి గా పంపి కాబినెట్ లో తీసుకుందాం అనే దాక వచ్చింది. అయితే సిద్దరామయ్య బిజెపి పక్క రాష్ట్రం వాళ్ళని మన దగ్గర నుంచి ఎంపి గా పంపుతుంది అని వెంకయ్య నాయుడు ఉదాహరణ చూపించటం తో బిజెపి డిఫెన్స్ లో పడింది,ఈ నేపద్యంలో చిన్నమ్మ ని ఎంపి గా చెయ్యలేకపోయారు. వాస్తవానికి NTR కుమార్తె ని ఎంపి గా పంపితే తెలుగు వారి ఓట్లు గంపగుత్తగా పడతాయి అనేది బిజెపి హై కమాండ్ కి ఉన్న లెక్క. సిద్దరామయ్య దానికి గండి కొట్టే దాకా, పురందేశ్వరి ప్రయత్నాలు రాష్ట్ర బిజెపి లో ఉన్న నాలుగు వర్గాల్లో ఉన్న నలుగురు నేతలకు తెలీవు. ఎంపి టికెట్ ఇవ్వలేకపోయే సరికి రాష్ట్ర అధ్యక్షా పదవి కి కన్సిడర్ చెయ్యండి, నేను హరిబాబు గారు ఒకే సామాజిక వర్గం, కాని నాకు నా కుటుంబానికి నా సామాజిక వర్గం లో మంచి పట్టు ఉంది, గణనీయం గా తెలుగుదేశం ఓట్స్ చీల్చవచ్చు, ఒక మహిళకు పదవి ఇస్తే మహిళలు కూడా మన పార్టి తో ఉంటారు అనే కొత్త ప్రపోజల్ అధిష్టానం ముందుకి వెళ్ళింది అని తెలియగానే రాష్ట్ర బిజెపి నేతలు బిత్తర పోయి విలవిలలాడుతున్నారు. మొత్తానికి చిన్నమ్మ సైలెంట్ గా ఇచ్చిన ట్విస్ట్ కి షాక్ కి గురి అయ్యారు రాష్ట్ర బిజెపి నేతలు అని సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here