LOL : నిన్న జగన్ ఒక ప్రశ్న అడిగాడు,వచ్చిన ఆన్సర్ కి బిత్తర పోయాడు

Advertisements

సద్దాం హుస్సేన్ మరణం, నిన్నటి మాచ్ లో ఇండియా ఓడిపోవటం, రెండవ ప్రపంచ యుద్ధం ఇలాంటివి తప్పితే మిగతా అన్నిటికి చంద్రబాబు కారణం అని జగన్ మోహన్ రెడ్డి అనటం మనం వినే ఉన్నాం. ఒక కథ గుర్తుందా.. పిల్లోడిని ఆవు మీద వ్యాసం చెప్పమంటే.. ఆవు తెల్లగా ఉండును, ఆవు గడ్డి మేయును, ఆవు పాలు ఇచ్చును….సరే విమానం మీద చెప్పరా అంటే విమానం గాలి లో ఎగురును…విమానం నుంచి చుసిన ఆవు కనిపించును….

ఆవు తెల్ల గా ఉండును..ఆవు గడ్డి మేయును…. సరే మీ ఇంటి గురించి చెప్పు రా అంటే…మా ఇల్లు రామాలయం పక్కన ఉండును…..మా ఇంటి గోడలకి తెల్ల రంగు వేసితిమి….ఆవు కూడా తెల్ల గా ఉండును..ఆవు గడ్డి మేయును…..ఇలా ఉండేది అని ఒక కథ చెప్పేవాళ్ళు…..ఆ కథలో ఉన్న పిల్లోడు పెరిగి పెద్ద అయ్యి జగనన్న అయ్యాడు….ఏమి జరిగినా చంద్రబాబు…చంద్రబాబు….జనాలు కూడా వినటం మానేశారు…..మానేశారు అని మేము చెప్పట్లేదు….నిన్న జగన్ ప్రశ్నకి వచ్చిన ఒక సమాధానం చెప్తుంది…. నిన్న జగనన్న పాదయాత్రలో భాగం గా నెల్లూరు జిల్లా కావలి పబ్లిక్ మీటింగ్ లో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ”2014లో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ప్రకటించారు. కానీ.. ఆ హోదా వద్దని.. ఏదో ప్యాకేజికి సరే చెప్పారు చంద్రబాబు. చట్టబద్ధంగా లభించే హోదా హక్కును వద్దనే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారు..?” అని హై పిచ్ లో ప్రశ్నించారు…..ముందు వరస లోనుంచి నేనే అని సమాధానం వచ్చింది….దానికి జగన్ కాస్త అసహనం కి లోను అయినట్టు తెలుస్తుంది, వెంటనే అక్కడ ఉన్న వైకాపా కార్యకర్తలు అతన్ని పక్కకి లాగేశారు. కాకపోతే ఒకటి మాట్లాడుకుందాం, అతను అన్ని మీటింగులకి వచ్చి, అందరు చెప్పేవి విని తనకి నచ్చిన వారికి ఓటు వేసే సాధారణ ఓటరు అనుకోండి. గత ఎన్నికల్లో ….

చంద్రబాబు న్యాయం చెయ్యగలడు అని ఆయనకి వేసి ఉండొచ్చు… ” మనలో మన మాట, హక్కెవరు ఇచ్చారు హక్కెవరు ఇచ్చారు, డెమోక్రసీ డెఫినిషన్ చదువుకుని మీటింగులు పెట్టచ్చు గా. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి ఏది మంచో అది చెయ్యటానికి తమ ప్రతినిధులని ఎన్నుకుని చట్ట సభలకు పంపటమే ప్రజాస్వామ్యం”…అలా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఎన్నుకున్న వ్యక్తీ ముఖ్యమంత్రి….ఆయన ప్రజలకి ఏది మంచి అనే డెసిషన్ తీసుకుంటారు….ఆయనేప్పుడో డెసిషన్ తీసుకుంటే ఇప్పుడొచ్చి మారాం చేస్తావ్ ఏంటి జగననన్నాయ్…. అందుకే కడుపు కాలిన ఎవడో నేనే అన్నాడు….ఈ మాత్రం చిన్న లాజిక్ కుడా తెలీకుండా….దేనికి సారూ మా ప్రాణాలు తీస్తారు…. దారుణం కదా,ఇక ఆగండి జగన్ గారు….ఆ నాడు హోదా వచ్చే అవకాశం లేదు కాబట్టి పాకేజీ కి ఒప్పుకున్నారు….బిజెపి తోక జాడిస్తే లైన్ లోకి తెచ్చుకున్నారు….. మీరు పొత్తుల కోసం, కేసు మాఫీ కోసం అటు పోకపోతే చాలా వచ్చేవి….ఎప్పుడో…. ఓహ్ గింజేసుకోమాకండి….జనం బాగా ముదిరి పోయారు…అది మీ ప్రశాంత్ కిషోర్ రివ్యూస్ చెప్తున్నాయి… జియో దెబ్బ కి జనం కి వార్తలు అన్ని చేతిలో వచ్చేస్తున్నాయ్…ఇంకా జనం ముందు ఈ ఓల్డ్ స్కూల్ డాన్సులు ఏందీ అన్నాయ్…..చండాలం గా ఉంది…. ఎప్పటికి అయిన నిన్ను ప్రధాని గా చూద్దాం అనుకుంటుంటే నువ్వేమో ఇంకా అలాగే ఉన్నావ్….

Advertisements

Leave a Reply