ఎట్టకేలకు కష్టాల నుంచి బయటపడిన ప్రియా ప్రకాష్ వారియర్

Advertisements

సోషల్ మీడియా లో ఇప్పుడు ఎటు చూసినా ఒక కేరళ కుట్టి గురించే చర్చ. ఆ కొత్త భామ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ అని ప్రత్యేకంగా చెప్పే పని లేదు. కేవలం 20 సెకన్లలో తన హావభావాలతో నెటిజన్లను ఫిదా చేసి అల్లు అర్జున్ వంటి హీరోలను కూడా క్లీన్ బౌల్డ్ చేసిన ప్రియాకు ఇప్పుడొక పెద్ద కష్టం వచ్చింది.. సెలబ్రెటీ రానంత వరకూ ఎవరూ పట్టించుకోలేదు, సంతోషం గ సాధారణ అమ్మాయి లా ఇంట్లోనే ఉండేది. అయితే ఒక్కసారిగా ఈ రేంజ్‌లో సెలబ్రెటీ హోదా వచ్చే సరికి మీడియా దృష్టంతా అలాంటి వాళ్ల పైనే ఉంటుంది. ఇప్పుడు ప్రియా ప్రకాష్ పరిస్థితి కూడా అదే.

ఈ రేంజ్‌లో క్రేజ్ రావడంతో ప్రియా కి కష్టాలు మొదలయ్యాయి. పొద్దున్నే నిద్ర లేచే సరికే ఆమె ఇంటర్వ్యూ కోసం మీడియా ప్రతినిధులు క్యూ కడుతూ ఉన్నారు. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు అక్కడ పోగావ్వటం తో ఆమె ఇంటి చుట్టూ కోలాహలం నెలకొంది. దీనివల్ల ప్రియ ఇంటి చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అయితే తమ కూతురికి పేరు రావడం మంచిదే అయినా మీడియా చేస్తున్న హడావుడితో ఒకింత ఇబ్బందిగా కూడా ఉందని ప్రియా తల్లి ప్రీతా తెలిపారు. తనకు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తున్నాయని,పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారని, అందుకే కొత్త గా వచ్చిన ఈ కష్టాల నుంచి తప్పించుకోవటానికే ప్రియాను హాస్టల్‌కు పంపించేసారని తెలుస్తుంది. ఉన్నట్టుండి వచ్చిన ఈ అమాంతం అయిన క్రేజ్‌తో తమ కూతురు బాగా కష్టపడిందని,ఆమెకు ఇబ్బందిగా కూడా ఉందనిప్రీతా చెప్పారు. అందుకే ఈ హడావుడి తగ్గేంత వరకూ హాస్టల్‌కు పంపినట్లు తెలిపారు. పైగా చిత్ర దర్శకుడు కూడా సినిమా విడుదలయ్యే దాకా ప్రియా ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పినట్లు ఆమె తల్లి చెప్పారు. సినిమా కొంత

మాత్రమే పూర్తయిందని, ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉందని దర్శకుడు తమతో చెప్పాడని, ఈ తలనొప్పంతా ఎందుకని ప్రియాను హాస్టల్‌కు పంపినట్లు ఆమె తల్లి ప్రీతా తెలిపారు.

Advertisements

Leave a Reply