వైకాపా – బిజెపి పొత్తు అయితే ఎవరికి ఎంత లాభం? హై కమాండ్ చేతికి అందిన పీకే రిపోర్ట్

రాష్ట్రానికి విభజన హామీల అమలు విషయం లో బిజెపి సర్కారు మోసము చేసింది అనే అభిప్రాయం అందరికి ఉంది. అంతే కాకుండా తిరుపతి లో మోడీ ఇచ్చిన హామీలు అన్ని నీటి మూటలు అనే సరికి బాధ పడుతున్నారు, చాలా ఆగ్రహం గా ఉన్నారు. నమ్మదగిన మిత్ర పక్షం తెలుగు దేశాన్ని కాదు అనుకుని, మోడీ ఏమి సాధిస్తాడో అని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. హోదా ఇవ్వకపోగా ఏపీ పట్ల కేంద్రం, ప్రధానిమోదీ దారుణమైన నిర్లక్ష్యం చూపుతున్నారంటూ సామాన్య జనం ఆవేశం తో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో అధికార తెలుగుదేశం పార్టీ, బీజేపీతో దూరమవుతోంది. బిజెపి కూడా వైసిపి ఉందనే ధైర్యంతోనే టిడిపి కి దూరం అవుతుందనే వాదనలు ఉన్నాయి. కేసుల కోసమే జగన్‌ జతకడుతున్నారంటూ టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రశాంత్ కిశోర్ కి చెందిన బృందాలు పలు ప్రాంతాలలో గత పది రోజులుగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వే బిజెపి చేయించిందా? వైకాపా నా అనేది స్పష్టత లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని ఖరాఖండీగా తేల్చిచెప్పిన తర్వాత బీజేపీపైనా, ఎన్డీయే సర్కారుపైనా ప్రజలలో ఏ మేరకు వ్యతిరేకత ఉంది? ఇది ఎన్నికలలో ఏ మేరకు ప్రభావం చూపనుంది? అన్న కోణంలో సర్వే బృందం జనం అభిప్రాయాలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ, బీజేపీతో జతకడితే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అన్న అంశంపై పలు కోణాలలో సర్వే బృంద సభ్యులు జనంలో వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పీకే టీమ్‌తోపాటు.. స్థానికంగా ఉండే యూనివర్సిటి విద్యార్ధులు సర్వే చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలలో బీజేపీతో జత కట్టాల్సి వస్తే ఎంత శాతం మైనార్టీ, దళిత ఓటర్ల మద్దతు ఉంటుంది? ఎంతమంది వ్యతిరేకిస్తారు? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో పలువురి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. అయితే మైనార్టీ,దళిత వోటర్లలో షుమారు 57% మంది దూరం అవుతారని తేలిందట. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేసిందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉన్న పరిస్థితులలో బీజేపీ మీద ప్రజాగ్రహం ఎంత ఉంది అనే అంశంపై పీకే బృందం ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళితో ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రశ్నకు షుమారు

82% మంది బిజెపి మీద వ్యతిరేకతతో ఉన్నారట. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సానుకూలంగా వ్యాఖ్యానించిన ప్రభావం కొంత ఉంటుందని సర్వే బృందం పరిశీలించినట్లు సమాచారం. సంప్రదాయ కాంగ్రెస్‌ కుటుంబాల వారిలో మెజార్టీ ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా ఉన్నారని, రాహుల్‌ ప్రకటన నేపథ్యంలో వారిలో కొంతమంది కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే ప్రభావం ఉండవచ్చని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రంలో ప్రభావిత పార్టీ కాకపోయినా,హోదా అంశంపై బీజేపీకి వ్యతిరేకత పెంచుకున్నారు. ఈనేపథ్యంలో బీజేపీతో జతకడితే కనీసం 2 నుంచి 3 శాతం మందైనా వైసీపీకి దూరమవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు కలసి వచ్చే వర్గాల ఓట్లు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో సర్వే టీమ్‌ ఆరా తీసింది. కాని దానికి సైతం వ్యతిరేక స్పందన ఎదురయ్యింది.వైకాపా బిజెపి కలిసి ఈ రాజకీయ డ్రామా ను నడిపిస్తున్నాయని 34%, తెలుగుదేశం బిజెపి ఆడుతున్న నాటకం అని 13% శాతం, బిజెపి కావాలనే చేస్తుంది అని 61% మంది, తెలుగుదేశం ప్రభుత్వానికి స్పష్టత లేదని 26% అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా తెలుగు దేశం మాత్రమె కేంద్రం తో పోరాడగలదు అని 54%, కాంగ్రెస్ అని 2%, వైకాపా పోరాటం మీద నమ్మకం ఉందని 21%, జనసేన మీద నమ్మకం ఉందని 13% అభిప్రాయపడ్డారట. ఈ సర్వే రిపోర్ట్ ప్రస్తుతం హై కమాండ్ చేతిలో ఉందని ఆ రిపోర్ట్ ఆధారం గానే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here