Exclusive : ప్రభాస్ పెళ్లి వార్తల్లో నిజమెంత?

Advertisements

ఈశ్వర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ రోజు ఊహించి ఉండడు బాహుబలి లాంటి ఒక సినిమా చేస్తాను అని.

బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ని ఎప్పుడు వెంటాడే ప్రశ్న ఒక్కటే, పెళ్ళెప్పుడు అని. ఆ ప్రశ్న వినగానే తనదైన శైలి లో అందం గా నవ్వి అక్కడనుంచి జారుకుంటాడు. బాహుబలి తో ప్రపంచం ని తిప్పి చూసేలా చేసిన ఈ ఆరడుగుల అందగాడు తల తిప్పి చూసే అమ్మాయి ఇప్పటి వరకు కనపడలేదు అంటే ఆశ్చర్యమే. బాహుబలి 2 ప్రమోషనల్ కార్యక్రమాల్లో అనుష్క ప్రభాస్ మధ్య ఉన్న చనువు చూసి వారివురు త్వరలో ఒక ఇంటి వారు అవుతారు అని అందరూ ఊహించారు. కాని ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏమీ వినపడలేదు.

ఇదిలా ఉంటె న్యూ ఏజ్ మీడియా లో ప్రభాస్ త్వరలో మెగా అల్లుడు కాబోతున్నాడు అని ఒక న్యూస్ గత వారం రోజులు గా హల్చల్ చేస్తుంది. ప్రభాస్ త్వరలో నాగ బాబు అల్లుడు కాబోతున్నాడు అని, నిహారిక ని పెళ్లి చేస్కోబోతున్నాడు అనేది ఆ న్యూస్ సారాంశం. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, ప్రభాస్ నిహారిక పెళ్లి మీద చిరంజీవి స్పందన,నాగ బాబు స్పందన, నిహారిక స్పందన,కృష్ణంరాజు ఏమన్నాడో తెలుసా? రాజమౌళి ఏమన్నాడో చుస్తే షాక్ అవుతారు ఇలా రకరకాల టైటిల్స్ తో థంబ్ నెయిల్స్ తో చెలరేగిపోయారు.

కాని వాస్తవానికి ఇదొక పెద్ద పులిహోర న్యూస్ అని తేలిపోయింది. ఇదే విషయం అయ్యి కొందరిని సంప్రదించగా ప్రభాస్ వయసు 38,నిహారిక వయసు 23,ఇద్దరికీ దాదాపు 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అంతే కాక నిహారిక ఇప్పుడే తన కెరీర్ మొదలు పెట్టింది. అసలు ప్రభాస్ కి నిహారిక కి ఎలా చుసినా మ్యాచ్ కాదు. అంతే కాక తన హోం ప్రొడక్షన్ లో సాహో లో నటిస్తున్న ప్రభాస్ ఇప్పటికి కూడా పెళ్లి మీద నోరు విప్పట్లేదు. ఇదేదో ఉబుసుకుపోక రాసిన వార్తా తప్పితే అందులో 1% కూడా నిజం లేదని తేల్చి చెప్తున్నారు. గతంలో సాయి ధరంతెజ్ తో నిహారిక పెళ్లి అని ఇంకొక సోది న్యూస్ ఎంత పాపులర్ అయ్యిందో మీరు మర్చిపోయి ఉండరు కదా?

Advertisements

Leave a Reply