పవన్ కి ట్వీట్ చేసి డిలీట్ చేసిన పూనమ్ కౌర్

Advertisements

నిన్న పూనమ్ కౌర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసు పాలైన కత్తి మహేష్ పై న్యూట్రల్ వర్గాల నుంచి కూడా ఎదురు దాడి వస్తున్నా సంగతి తెలిసిందే. ఐతే నిన్న ఒక ప్రైవేట్ చానల్ డిబేట్ నుంచి అర్ధంతరం గా వెళ్ళిపోయిన కత్తి మహేష్ నిన్న రాత్రి నుంచి విమర్సల దాడి ని ఎదుర్కొంటున్నాడు. పూనమ్ కౌర్ అని ఒక హీరోయిన్ పెట్టిన ట్వీట్ ని తనకు అన్వయించుకుని నిన్న తీవ్ర విమర్శలు చేసిన కత్తి మహేష్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. తిరుమలలో పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో అర్చన జరిగిందని, త్రివిక్రం తో విభేదాలు దేనికి అని, ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్ లో ఉన్నప్పుడు, ఆ హాస్పిటల్ బిల్లులు ఎవరు కట్టారని, ఇలా ఆరు ప్రశ్నలు సంధించాడు కత్తి మహేష్. తీవ్రమైన విమర్శలు చెయ్యటం తో నిన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ,కత్తి మహేష్ కోసం భారీ గా మొహరించారు. కాని పోలీసులు చేరుకొని ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఈ నేపధ్యంలో పూనం కౌర్ పవన్ కళ్యాణ్ ని మెన్షన్ చేస్తూ ట్వీట్ చేసింది.

 

కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో తానూ చాలా ఇబ్బంది పడుతున్నా అని, దయ చేసి ఈ విషయంలో మీరు స్పందించి తనకు సపోర్ట్ చెయ్యాలని  ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఈ విషయం తన కుటుంబానికి, పరువు కి సంబందించిన విషయమని తెలిపింది. అయితే కాసేపట్లోనే ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది పూనం కౌర్.

Advertisements

Leave a Reply