వీలైనంత త్వరగా CMని కలవాలి అపాయింట్మెంట్ కోరిన పవన్ ఆఫీస్, అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పవన్ మొహం చూపించలేక అఖిలపక్ష సమావేశానికి డుమ్మాకోట్టారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం కూడా వివరిస్తున్నారు.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో సక్యతగానే మెలిగారు. తెలుగుదేశం పార్టీపై ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన విమర్శలు కూడా పెద్దగా ఎక్కడా లేవు. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ఎంపీలను విమర్శించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై మాత్రం ఎప్పుడూ విమర్శలు చెయ్యలేదు. అలాగే ప్రజా సమస్యలను

చంద్రబాబు వద్దకు పవన్ తీసుకువెళ్ళిన సందర్భంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ వాటికి పరిష్కారం చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.గతేడాది ఉద్దానం బాధితుల సమస్య పరిష్కారానికి గాను చంద్రబాబు వద్దకు పవన్ వెళ్ళిన సమయంలో చంద్రబాబు స్పందించిన తీరు పవన్ కి ఆయన ఏ స్థాయిలో గౌరవం ఇచ్చారో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. కాని పవన్ జనసేన ఆవిర్భావ సభలో లోకేష్ పై చేసిన విమర్శలు..ఆ తర్వాత చంద్రబాబుపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. అప్పటి నుంచి చంద్రబాబు కూడా పవన్ విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కేంద్రానికి లోంగిపోయారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా పరోక్షంగా కేంద్రానికి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కూడా పవన్ హాజరు కాకపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. దీనికి కారణం కూడా చెప్తున్నాయి తెలుగుదేశం వర్గాలు. చంద్రబాబు వద్ద పవన్ విలువ పోగొట్టుకున్నారని అందుకే ఆయన హాజరు కాలేదని ఆ విషయం పవన్ కి స్పష్టంగా అర్ధమైంది. తెలుగుదేశం నేతలకంటే పవన్ కి చంద్రబాబు ఎక్కువ విలువని ఇచ్చారని,కాని తన మనస్తత్వంతో ఆ గౌరవాన్ని, హుందాతనాన్ని పోగొట్టుకున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో పవన్ ఆఫీసు నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారని వార్తలు వస్తున్నాయి.ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిఎం ని కలవాలి అని పవన్

కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల గురించి విచారించగా అవన్నీ నిజం కాదని, అఖిల పక్షం కి రాకుండా వ్యక్తిగత సమావేశం కి మాత్రం ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పవన్ మధ్యలో ఎదో రహస్యంగా జరుగుతుంది అని చెప్పటానికి ఒక పార్టి కి చెందిన మీడియా అలా ఫేక్ వార్తలు ప్రసారం చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరి దారులు వేరని కూడా అంటున్నారు. చూద్దాం ఈ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here