పవన్ ముఖ్యమంత్రి కావటానికి జనసేన ప్లాన్ రెడి

జనసేన పార్టి ఏ ఉద్దేశంతో పెట్టినా ఇంకా అది ఒక పూర్తీ స్థాయి రాజకీయ పార్టిగా మారలేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చుట్టూనే ఆ పార్టీ తిరుగుతుంది. 2014లోనే పార్టి ప్రారంభించిన ఆ నాడు పోటి కి దూరంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. పార్టీ సంస్థాగత నిర్మాణం కాని, కార్యకర్తల శిక్షణ కాని, ఎంపిక కాని ఏమి జరగలేదు. ప్రస్తుతానికి అప్పుడప్పుడు ట్విట్టర్ లో కనిపించేదే పార్టినా అన్న సందేహం కలుగుతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చాలా క్రేజ్ ఉన్న అతి కొద్ది మందిలో ఒకడు. అయితే పవన్ అభిమానులు ఎక్కువ మంది అత్యుత్సాహంతో పవనిజం అనే ఒక రిలీజియన్ క్రియేట్ చేసి, దాన్ని ఒక మతం గా ప్రచారం చేసి, పవన్ కి దేవుడు స్థాయి కూడా ఇచ్చేసారు.  అయితే పవన్ సినిమా అభిమానులు మొత్తం రాజకీయ అభిమానులుగా మారారా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే రాజకీయాల్లో

విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయ్, దానిని గమనించి మెలగాలి. అయితే తెలిసి తెలీకుండా పవన్ ఫాన్స్ చేసే కొన్ని కామెంట్స్ పవన్ కి నష్టం చేకూర్చే విధం గా ఉన్నాయి. పవన్ నాకు సిఎం పదవి లక్ష్యం కాదు, ప్రజా సేవ లక్ష్యం అని చెప్తుంటే, పవన్ అభిమానులు మాత్రం సిఎం కావటానికి ప్రణాలికలు రాసేస్తున్నారు. జనసేన అభిమానుల పెజిలలో, ఫేస్బుక్ గ్రూపులలో, వాట్సాప్ లో ఇది ఒక గొప్ప ఐడియాలా షేర్ చేస్తున్నారు.ఇదే ఆ అతి గొప్ప ఐడియా…

“పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కర్ణాటక ఎలక్షన్ ఒక్కసారి గమనించండి. పవన్ సీఎం అవ్వడం ఏమంత కష్టం కాదు 38 సీట్లు వచ్చిన జెడి(యస్) కుమార స్వామీ ఈరోజు సీఎం అవుతున్నారు. దయచేసి చెప్తున్న చాలామంది పవన్ ని సీఎం గా చూడాలని ఉన్నారు.
కానీ సీఎం కావడం కష్టం అని 88 సీట్లు తెచ్చుకోలేడని సీఎం కాలేడని ఇతర పార్టీలో అలాగే ఉండిపోయారు.
కర్ణాటకలో చూడండి ఏం జరుగుతుందో దాన్నిపట్టి చూస్తే పవన్ సీఎం సీటుకి ఎంత దగ్గరలో ఉన్నాడో ఎవ్వరూ నిరాశ పడకుండా గెలుపుకి కృషి చెయ్యండి.
జై జనసేన✊
జై హింద్ ✊✊”

ఒక పక్క పవన్ 175 సీట్లలో పోటి అంటుంటే పవన్ ఫాన్స్ మాత్రం ఒక 20-25 సీట్లు వస్తే మనం కూడా  స్వామిలా సిఎం అవొచ్చు అని భావిస్తున్నారు. లక్ష్యాలు చిన్నగా ఉన్నప్పుడు ఫలితాలు ఇంకా చిన్నగా ఉంటాయని తెలీదా? ప్రజారాజ్యం అతి విశ్వాసంతో చరిత్రలో కలిసిపోతే, జనసేన విశ్వాసం లేక చరిత్రలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. పదవులే లక్ష్యంగా ఉన్న ఒక పార్టి ని ఈసడించుకుంటున్నారు, జనసేన కూడా అలా అవుతుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here