EXCLUSIVE : పవర్ స్టార్ నెక్స్ట్ ఫిల్మ్ : సింగిల్ షెడ్యూల్ లో పూర్తి

Advertisements

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదలై టాక్ కి సంబంధం లేకుండా వసూళ్లు కురిపించింది. కాని అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఈ చిత్రం కి కాపి రైట్ వివాదం, ఇప్పుడు బయ్యర్ల వివాదం అని రకరకాలు చుట్టు ముట్టాయి. బయ్యర్స్ కోసం మరొక సినిమా చెయ్యాలని పవన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణా రాష్టంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సమాయత్తమవుతున్నాడు జనసేన అధ్యక్షుడి హోదాలో వెళ్ళారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాల్లో బిజీ అయిపోతాడేమో, సినిమాలు చేయడేమో అనే చర్చ జరుగుతోంది. కానీ తాజా వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాకి సంబంధించి సన్నాహాలు చాలా వేగం గా అవుతున్నాయట.ఇప్పటి వరకు ఎటువంటి వార్త బయటకి రాని ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్ న్యూస్ మీకోసం….

మెగా హీరో రాం చరణ్ తో ‘రంగస్థలం’ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కి పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాని నిర్మించే అవకాశం దక్కింది. ఈ నిర్మాతల దగ్గర నుంచి ఎప్పుడో అడ్వాన్స్ పుచ్చుకున్న పవన్ ఇప్పుడు వీరి సినిమాకి డేట్స్ కేటాయించాడట. ‘రభస’, ‘కందిరీగ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది ఒక సూపర్ హిట్ తమిళ్ చిత్రంకి రీమేక్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుందట. సరిగ్గా 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పేసాడట,అలానే డేట్స్ కేటాయించాడట. నలభై రోజుల్లో సినిమా అంటే చాలా ప్లానింగ్ ఉండాలి. లేకపోతే షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. కాని దొరికిన అవక్స్సాన్ని వదులుకునేందుకు సిద్దం గా లేని మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు, దర్శకుడు అంగీకరించడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి అగ్రిమెంట్ చేసాడని సమాచారమ్. ముందుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయడానికి ప్లానింగ్ జరుగుతోందట.పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమా త్వరలో ప్రారంభం అయ్యి, సమ్మర్ చిఅవ్రికి విడుదల అవుతుంది అని తెలుస్తుంది.

Advertisements

Leave a Reply