OPEN LETTER : పవన్ మీరు పాయసం అనుకుని విషం తాగుతున్నారు అందుకే ఈ ఆక్రోశం

Advertisements

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అనగానే అతని ఆవేశం లో నిజాయితీ నచ్చే చాలా మంది సపోర్ట్ చేసారు. ఎన్నికల్లో పోటి చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను,కేంద్రం లో బిజెపి కి, రాష్ట్రం లో తెలుగు దేశం కి మద్దతు ఇస్తాను అన్నప్పుడు ఒక నిస్వార్ధం అయిన రాజకీయ నాయకుడు కనిపించాడు.రాష్ట్రం మంచి కోరే ఒక కొత్త శక్తి కనిపించింది.పవన్ సరిగ్గా పార్టి నిర్మాణం మీద దృషి పెట్టి ఉంటె 2019 నాటికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గా ఎదిగే అవకాశం ఉంది.

ఉద్దానం బాదితులు ఇత్యాది విషయాలు ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాటం చేసినప్పుడు ఒక భరోసా కనిపించింది. కాని రాను రాను పవన్ సైతం మరొక రాజకీయ నాయకుడు గా మిగిలిపోతున్నాడెమో అనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పవన్ నిజాయితీ మనం అనుకున్నంత నిజమేనా, అంత లోతు ఉందా అనిపిస్తుంది. ఇద్దరు రాజకీయ నిరుద్యోగులని చెరొక పక్కా పెట్టుకుని ఏమి సాధించాలి అనుకుంటున్నాడో అర్ధం కాలేదు. ఒక రకం గా చుస్తే జయ ప్రకాష్ నారాయణ గారికి కాస్త క్రెడిబిలిటి ఉంది, ఇంకా ఆయనని నమ్మే వారు ఉన్నారు. కాని ఆయన కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగలేక పోయారు. ఆయన లైక్ మైండెడ్ కింద కలుపుకున్నా ఓకే…. కాని పవన్ జీ, ఈ ఉండవల్లి ఎవరు? అతని క్రెడిబిలిటి ఏంటి? 2009 లో మీరు పంచలు ఊడతీస్తాం అన్న కాంగ్రెస్ మనిషి కాదా అతను, కాంగ్రెస్ హటావో అన్నప్పుడు మీరు అన్న ఆ కాంగ్రెస్ నాయకుడు కాదా అతను. నిజం గా అతనికి క్రెడిబిలిటి ఉంటె రామోజీరావు గారి మార్గదర్శి మీద వేసిన కేసులు ఒకటి కూడా దేనికి నిలబడలేదు, అతని ఆరోపణలలో పస ఉంటె అవినీతి కి అంత వ్యతిరేకం గా పోరాడే వాడు అయితే, ఇప్పటికి ఆంద్ర ప్రదేశ్ చుసిన అత్యంత అవినీతి కుటుంబానికి దేనికి జై కొడతాడు?

అతన్ని వైఎస్సార్సిపి మనిషి గా ప్రజలు గట్టిగా నమ్ముతున్న తరుణం లో, జగన్ కి మద్దతు గా నిలబడుతున్నాడు అని భావిస్తున్న తరుణం లో మీరు అతన్ని పక్కన కూర్చోపెట్టుకోవటం ఏంటి? అతను ఎలా మేధావి….? ఒక వేళ అంత మేధావి అయితే రాష్ట్ర విభజన లో ఇతనికి భాగం లేదా? ఆ రోజు నా రాష్ట్రానికి కావలసినవి ఇవి అని పోరాడి దేనికి సాధించలేదు? అతను ఒక సాధారణ అవకాశవాద రాజకీయ నాయకుడు, ఒక కుహానా మేధావి. అంతకు మించి ఏమి లేదు.ఆయనకి మీ వకాల్తా ఏంటి? ఒక వేల ఆటను రాష్ట్రం కోసం ఇరగ పోరాడి ఉంటె 2014లో దేనికి పోటి చెయ్యలేదు? ఇప్పుడొచ్చి అన్యాయం అని గుండెలు బాదుకుంటే ఎవరు నమ్ముతారు? ప్రజల్లో తెలుగు దేశం ఎంపిలు పోరాటం చేసారు అని సందేశం వెళ్ళాక, మీరు చెల్లెలు కవిత కి శుభాకాంక్షలు చెప్పారు కాని అన్నయ్య గల్లా, తమ్ముడు రామ్మోహన్ నాయుడు లాంటి వారు చేసిన పోరాటం కి మద్దతు ఇవ్వలేకపోయారే…. మీ అన్నయ్య చిరంజీవి అసలు పార్లమెంట్ కి పోలేదు, ఆయన్ని దేనికి ప్రశ్నించరు? మీ కుటుంబం అయితే ఒక న్యాయమా? వైఎస్సార్సిపి ఎంపిలు పోరాటం చేసారు……కాని అది వాళ్ళలో వాళ్ళు గుట్టుగా….అది కూడా మీరు అడగట్లేదు మీరు…అసలెవరు ఉండవల్లి? ఎలా మేధావి? అలాంటి విషాన్ని పాయసం …. అనుకుని సేవిస్తే జనసేన మరొక ప్రజా రాజ్యం అయ్యే రోజు ఎంతో దూరం లో లేదు….మీరు రాష్ట్రం లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉంటె బావుండు అనుకునే వారిలో మొదటి వాడిగా నా విజ్ఞప్తి.

– ఆంధ్రుడు

Advertisements

Leave a Reply