ఆంధ్రా బిజెపి నాయకులకు ఓపెన్ ఛాలెంజ్

Advertisements

ఆంధ్రా బిజెపి నాయకులు రాష్ట్రానికి అన్ని చేసాం, అన్ని ఇచ్చాం అంటున్నారు, బానే ఉంది. అయిన సోము వీర్రాజు గారు మీరు కర్నూల్ లో ప్రెస్ మీట్ పెట్టినా,రాజమండ్రి లో రంకేలేసినా, విజయవాడ లో ఊదరకోట్టినా పెద్ద తేడా రాదు. మాట్లాడేది మీరు అయినప్పుడు జనం పట్టించుకుంటారు అనుకుంటున్నారా? మీ ఎమ్మెల్సి పదవి కి రాజీనామా చేసి చెప్పండి. అయ్యా విష్ణు కుమార్ రాజు గారు, మొన్న వ్యాఖ్యలు చేసి నా వ్యక్తిగతం అన్నారు, మళ్ళి ఇవ్వాళ ఎదో అన్నారు,గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, పొత్తు లేకపోతే మీ పేరు చివర ఎమ్మెల్యే అని టాగ్ ఉండేదా? మీ లాంటి వాళ్ళు మరి కొందరు ఉన్నారు గా….సార్ మీ అందరికి ఒక ఓపెన్ ఛాలెంజ్….

మీరు రాష్ట్రానికి అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము అంటున్నారుగా, గొంతు చించుకుని అరుస్తున్నారుగా, సంతోషం. నిజమే మీరు ఇచ్చారు, ఇచ్చినవన్ని చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేసి మింగేసింది. ఒప్పుకుందాం. అయితే ఒక మాట, మీ అపర మర మేధావుల బాచ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్స్ లోనో, మీ పార్టి ఆఫీసుల్లోనో ప్రెస్ మీట్ లు పెట్టి చెప్పే బదులు… బెజవాడ బెంజ్ సర్కిల్ లోనో, గుంటూరు నాజ్ సెంటర్ లోనో, వైజాగ్ ఆర్ కే బీచ్ లోనో, తిరుపతి ఎస్వి యూనివర్సిటిలోనో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టండి, జనాల మధ్యలో నుంచుని మీరేం ఇచ్చారో, ఎంత ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో,చెప్పండి. ప్రజల కళ్ళలోకి చూస్తూ చెప్పండి. తెలుగు దేశం గవర్నమెంట్ కి వాడుకోవటం రాలేదు అని ఇంటర్ తప్పిన వాళ్ళు మాట్లాడే బదులు ప్రూవ్ చెయ్యండి. ప్రూవ్ చేసి నోరు మూయించండి. అంతే కాని అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం అని సొల్లు కబుర్లు దేనికి, సొల్యుషన్ కావాలి కాని. మీరు వచ్చినా పర్లేదు, మేము ఎవరికీ తెలీము మా మీటింగ్ కి ఎవరు వస్తారు అంటే కేంద్ర నాయకులని తెచ్చుకోండి, వాళ్ళు బాగానే రిజిస్టర్ అయ్యారు మన జనాలకి. కోడి గుడ్లు, టమాటాలు మిమ్మల్ని టచ్ చెయ్యకుండా బయట పడండి, అది మీకు నిజం గా కడుపు మండిన ఆంధ్రుడు ప్రత్యెక హోదా ఇచ్చినట్టే భావించండి.రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడకండి.కడుపు మండిన ఆంధ్రుడు అంత పెద్ద కాంగ్రెస్ నే కప్పెట్టేసాడు, మీరొక లెక్క…?

Advertisements

Leave a Reply