అమరావతి వేదికగా జగన్ కు మరొక సాలిడ్ కౌంటర్ ఇచ్చిన పవన్ డిఫెన్స్ లో జగన్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గత కొన్ని రోజులు గా మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. తొలుత కేంద్రం మీద అవిశ్వాసం పెట్టాలి అని పవన్ డిమాండ్ చేస్తే…. మేము సిద్దం అని జగన్ సవాల్ విసిరారు. అంతే కాక మాకు MPల బలం లేదు, ఉంటె బిజెపి ని అల్లాడిస్తాం అని వణుకు పుట్టించారు. దానికి పవన్ స్పందిస్తూ మీకు ఏమి బలం కావాలన్నా నేను ఇస్తాను, మీరు మార్చ్ 5న అవిశ్వాసం పెడితే నేను మీకు కావాల్సిన బలం నేను ఇస్తా అని సవాల్ విసిరారు. దీనితో జగన్ డిఫెన్స్ లో పడిపోయారు. అయితే ఆ తర్వాత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి జగన్ చాలెంజ్ ఎప్పుడు చేసారు, మేము అసల అలాంటి పాడు మాటలు అనం అని ఖండించి సెల్ఫ్ గోల్ వేసారు.

అయితే ఆ తర్వాత కూడా జగన్ పవన్ పేరు ఎత్తకుండా చంద్రబాబు నాయుడు పార్టనర్ అని పవన్ ని సంభోదిస్తూ వస్తున్నారు. పవన్ కి ఉన్న నిజాయతి కి నా లాంటి వాడితో ఎప్పుడు కలవడు అనే క్లారిటి ఉంది జగన్ కి. కాబట్టి పవన్ ని తరగేట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చంద్రబాబు మనిషి పవన్ అని, పవన్ కి ఉన్న ప్రాముఖ్యత తగ్గించాలి అనేది జగన్ ప్రయత్నం లా కనిపిస్తుంది. ఈ నేపధ్యం లో వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి జనసేనాని కౌంటర్ ఇచ్చారు. జనసేన టీడీపీలో అంతర్భాగమని, జనసేనకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబే అంటూ జగన్ చేసిన విమర్శలను పవన్ తిప్పికొట్టారు. జనసేనకు చంద్రబాబు అయితే వైసీపీకి మోదీ అనుకోవాలా’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి ఒక మాట అనడం సులభమని, రాజకీయ నేతలు ఆలోచించి మాట్లాడాలని పవన్ సూచించారు.ఇప్పటి వరకు మోడీ జగన్ బంధం పై ఒక్క మాట కుడా మాట్లాడని పవన్ కూడా అనేయ్యటం తో జగన్ భారీగా డిఫెన్సు లో పడ్డారు.అంతే కాకుండా ఇప్పటికే పవన్ ని విమర్శిస్తూ కాపులకి దూరం అవుతున్న

జగన్ తాజా పరిణామం తో మరింత కూరుకు పోయారు.రాజధాని అమరావతి ప్రాంతం లో గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ సమీపంలో నూతన నివాసానికి పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం భూమి పూజ చేశారు. సతీసమేతంగా భూమి పూజలో పాల్గొన్న పవన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here