NTR షూటింగ్ అప్డేట్స్ : ఇందిరాగాంధీ రోల్ ఎవరో తెలుసా?

2018 లో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీస్ లో తోలి వరుస లో ఉండేది NTR బయోపిక్. స్వయంగా ఆయన కుమారుడే నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ చిత్రం గురించి రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డైరెక్టర్ తేజ మీద బాలకృష్ణ ఆగ్రహం గా ఉన్నారని, తేజా ప్లేస్ లో వేరే డైరెక్టర్ ని తీసుకుంటున్నారని కుడా వార్తలు వచ్చాయి. అందుకే షూట్ చేసిన తీజర్ కూడా జనవరి 18న రిలీజ్ చెయ్యలేదని కూడా వార్తలు వచ్చాయ్. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు ఎలా ఉన్నా ఈ సినిమా కి షూటింగ్ ముహూర్తం కుదిరిందని సమాచారం.ఈ చిత్రంలో 60కి పైగా గెటప్స్ బాలకృష్ణ వేయబోతున్నాడనేది ఫ్యాన్స్‌కు స్పెషల్ న్యూస్. ఈ చిత్రం మార్చి నాలుగున మొదలుకానుంది,ఐతే ఇందులో మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కాని ఇప్పటికే ఇందులో ఇందిరాగాంధీ రోల్ కి ఎవర్ని తీసుకోవాలి అనే అంశం మీద ఒక క్లారిటి వచ్చినట్టే కనిపిస్తుంది.ఈ చిత్రం లో ఇందిరా గాంధిగా…

విజయశాంతి..నదియా లో మధ్యలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచనలో ఉన్నారట. వీళ్లలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నదియా కాస్త సాఫ్ట్ గా ఉండటంతో విజయశాంతి అయితే బాగుంటుందని యూనిట్ ఆలోచన గా తెలుస్తుంది.విజయశాంతి బాలయ్య కలిసి నటించిన సినిమాల ట్రాక్ రికార్డ్ కూడా విజయశాంతికి కలిసి వచ్చే అంశం. అదీ కాక విజయశాంతి కూడా చాలా రోజులు గా సినిమాలకు దూరం గా ఉండటం తో అదనపు ఆకర్షణ అయ్యే అవకాసం ఉందని భావిస్తున్నారట. మరొక పక్క ఈ మధ్యకాలంలో కీలకమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నదియా, మంచి మార్కులు కొట్టేసింది. మరి ఈ ఛాన్స్ ఎవరికి వెళుతుందో చూడాలి.బాలకృష్ణ – సాయి కొర్రపాటి – విష్ణు నిర్మించే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here