నా కుమారుడుకి ఆ హీరోయిన్ తో ఎటువంటి సంబంధం లేదు

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టి రన్ చేసే మీడియాలోను, వెబ్సైట్స్ లోను వరుస కథనాలతో హోరెత్తించారు. తద్వారా గంటాను ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు. ఈ రూమర్లు ఎంత తీవ్ర స్థాయి కి చేరాయి అంటే వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేస్కోబోతున్నారని, కుటుంబం లో వివాదాలు అని వచ్చాయి. ఈ రూమర్లు విషపూరితం అవుతున్నాయని భావించిన గంటా క్లారిటి ఇచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు….

హీరోయిన్ సాయిపల్లవి, ఆమె గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మళయాళ ‘ప్రేమమ్‌’తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో మన ప్రేక్షకులను ఫిదా చేసేసింది. సాయి పల్లవి నటన, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. అయితే ఒకట్రెండు సినిమాలతోనే పేరు తెచ్చుకున్న ఈ సాయిపల్లవిపై సోషల్ మీడియా రూమర్స్ వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, హీరోయిన్ సాయిపల్లవి ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మంత్రి గంటా చెవిన పడటంతో ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ” ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించను కానీ తప్పక క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇతరుల జీవితాలపై మచ్చ వేసేలా వార్తలు రాయడం తగదు. నా కుమారుడు రవితేజపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవం. గంటా రవితేజ, సాయిపల్లవిపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. నా కుమారుడు, సాయిపల్లవి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు” అని గంటా తేల్చిచెప్పేశారు. కాగా మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కుమారుడు రవితేజ ఇటీవల ‘జయదేవ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సాయి పల్లవి కోలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందని సౌత్ ఇండస్ట్రీ మొత్తం గతంలో కోడైకూసిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌పైనే ఈ బ్యూటీ ఇంతవరకూ స్పందిచలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు రావడం.. దీంతో మంత్రి గంటా మీడియా ముందుకు రావడంతో ఈ రూమర్స్‌కు తెరపడినట్లైంది. చాలా వరకు రూమర్స్‌పై స్పందించడానికి సాయిపల్లవి మీడియా ముందుకు రాదన్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా మంత్రి స్పందించారు గనుక సాయిపల్లవి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here