నీదీ నాదీ ఒకే కథ బుల్లెట్ రివ్యూ

Advertisements

నీదీ నాదీ ఒకే కథ.. విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్‌ హీరోయిన్‌ గా నటించింది. నారా రోహిత్‌ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త కథతో పాటు, ఆ కథ చెప్పడానికి డాగ్ మి 95 అనే కొత్త పద్ధతిని ఉపయోగించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను మీడియా కోసం ప్రత్యేకంగా ఒక్క రోజు  ముందే ప్రదర్శించారు. ఈ సినిమా ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం..


ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

ఇప్పటితరం కథానాయకుల్లో మూసలో వెళ్ళకుండా సినిమా సినిమాకి వైవిధ్యం చూపించే నటుడు శ్రీవిష్ణు

ఈ చిత్రం లో రుద్రరాజు సాగర్ గా అతని నటన ఆకట్టుకుంటుంది

తండ్రికి నచ్చినట్టు ఉండలేక తనకు నచ్చింది చెయ్యలేక మానసిక సంఘర్షణకు లోనయ్యే కుర్రాడి పాత్రలో శ్రీవిష్ణు చాలా బాగా చేసాడు.

సట్నా టైటస్‌ నటన కుడా బావుంది

శ్రీ విష్ణు తండ్రి పాత్రలో దర్శకుడు దేవి ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది

ముఖ్యంగా ఈ చిత్ర నేపధ్య సంగీతం బావుంది

సినిమాలో ఎంటర్టైన్మెంట్ తక్కువ అనే చెప్పుకోవాలి.

సినిమాటోగ్రఫి సైతం బావుంది ఎడిటింగ్ బావుంది

ఈ చిత్ర దర్శకుడు తోలి సినిమాకి ఇంత కీలకమైన పాయింట్ ఎంచుకోవటంలోనే అతని ప్రతిభ కనపడుతుంది.

ఈ కథ  లో ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట ఎలాగోలా కనెక్ట్ అవుతాడు. అందుకే నీది నాది ఒకే కథ అనే టైటిల్ ఆప్ట్ ఈ సినిమాకి.

ఓవరాల్ గా ఇది కమర్షియల్ సినిమా కాదు, రొటీన్ సినిమా ఇష్టపడే వాళ్ళు దూరం గా ఉండవచ్చు. ఇది ఒక కొత్త సినిమా, ముఖ్యమైన కధాంశం ఉన్న సినిమా, అక్కడక్కడా స్లో అనిపించినా మొత్తం గా బావుంది అనిపిస్తుంది, మీకు ఈ జోనర్ సినిమాలు నచ్చితే తప్పక చూసే సినిమా.

ఆంధ్రుడు రేటింగ్ : N/A

 

Advertisements

Leave a Reply