చంద్రబాబు అంత సాఫ్ట్ కాదు,తొక్కిపట్టి నార తీస్తారు : పొగడ్తలతో ముంచెత్తుతున్న నేషనల్ మీడియా

రాజకీయం అంటే వ్యూహం ప్రతి వ్యూహం, ఎత్తులు పై ఎత్తులు. ఎదుటి వాడు దెబ్బ వేస్తాడు అని తెలిసే లోగా చావు దెబ్బ కొట్టటం ఒక పద్దతి, ఎదుటి వాడు దెబ్బ వేస్తె ఎం చెయ్యాలో ప్లాన్ చేసుకుంటూ ఉండటం రెండవ పద్దతి. ఈ రెండు పద్దతుల్లో ఒక పద్దతి తెలిసినా గొప్ప రాజకీయవేత్త అవుతారు, అదే ఈ రెండు పద్దతులు తెలిస్తే? ఈ రెండు కాక ఇలాంటివి మరొక వందా నూట యాభై తెలిసిన అరుదైన వ్యూహ వజ్రం చంద్రబాబు. ఆయన ప్రతి పని కి ఎక్కడో ఒక చోట లింక్ ఉంటుంది. అలా వ్యూహం వేసి తనని తన పార్టి ని కాపాడుకోవటం, సాధారణ విషయం అవుతుందా? అంటే కాదు అనే సమాధానం వస్తుంది. చంద్రబాబుకి వంటి నిండా కళ్ళు బుర్ర నిండా వ్యూహాలు ఉంటాయి. కరెక్ట్ గా ఆ వ్యూహ చతురత చూసే నేషనల్ మీడియా ఔరా అంది…

ప్రఖ్యాత News18 కథనం ప్రకారం, గత సంవత్సరకాలం గా చంద్రబాబు వాదన మారింది, కేంద్రం సహాయం చెయ్యాలి అన్న మాట పోయి బిజెపి సహాయం చెయ్యలేదు అనే మాట వచ్చింది. ప్రజల్లోకి ఎక్కడ బిజెపి మోసం చేసింది అనలేదు, ఒక వేళ అలా అంటే వాళ్ళు మోసం చేస్తే మీరు ఎలా ఊరుకున్నారు అనే ప్రశ్న వస్తుంది. అందుకే న్యాయం చెయ్యలేదు, అన్యాయం చేసింది అన్నారు. అది ప్రజల్లోకి ఇంకుతూ ఉంది. రాష్ట్రానికి ఎదో చెడు జరగబోతుంది అన్న సంకేతం ఇచ్చారు. అదే సమయం లో మన సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ జగన్ గారు ఎంట్రి. ఆయన వచ్చి ప్రత్యెక హోదా అనే అంశం ఎత్తారు, తెలుగుదేశం బాక్ స్టెప్ వేసింది, అందరు జగన్ అతి పెద్ద మూవ్ వేసాడు అనుకున్నారు. తెలుగు దేశం కూడా నెమ్మదించింది. చంద్రబాబు దణ్ణం పెట్టి తప్పుకుంటాం అన్నారు, వాళ్లకి మనం వద్దకపోతే మనకి వాళ్ళు వద్దు అన్నారు. దీని ద్వారా ప్రజల్లో ఒక మూడ్ క్రియేట్ అయ్యింది. బిజెపి నే విలన్ గా నిలబడింది, బిజెపి అని లంపటం ని చంద్రబాబు వదిలించుకున్నారు. ఆ పార్టి చేసిన నష్టం ప్రజల్లోకి వెళ్ళింది. ఇక చివరి అంకం జగన్ అసమ్మతి ట్రాప్ లోకి ఎప్పటి లానే నడుచుకుంటూ వచ్చి బోన్ లో పడ్డ ఎలుక అయ్యాక, చంద్రబాబు కేంద్ర మంత్రుల్ని విత్ డ్రా చేసారు.

ఈ లోగా జగన్ మోడీ రహస్య ఒప్పందాలు అంటూ మీడియా లో వార్తలు, వాటిని బలపరుస్తూ దాక్కుని చేస్తున్న వైకాపా నిరసనలు, మాకు విస్వాస్మ ఉంది అంటున్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో బిజెపి కేవలం వైసిపి ఉందనే నమ్మకం తో ఆంధ్రకు అన్యాయం చేసింది అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కాని ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటి చెయ్యలేని పరిస్థితి. అలా చెయ్యకపోతే వైకాపా శంకరగిరి మాన్యాలే. తెలుగు దేశం మరింత బలపడుతుంది. ఒకే దెబ్బకి రెండు పార్టీలు అవుట్…. అందుకే నేషనల్ మీడియా సైతం చంద్రబాబు మాస్టర్ స్కెచ్ కి ఫిదా ….చంద్రబాబు అంత సాఫ్ట్ కాదు తొక్కిపట్టి నార తీస్తారు అని పొగడ్తలతో ముంచెత్తుతున్న నేషనల్ మీడియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here