వచ్చే వారంలో జరగబోయే వీళ్ళిద్దరి మీటింగ్ దేనికి అంత ముఖ్యం?

తెలుగు దేశం పార్టి వర్గాలు చెప్పే మాటలు నిజం అయితే వచ్చే వారం లో ఒక కీలక మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ తెలుగు దేశం పార్టి అధినేత చంద్రబాబు నాయుడు కి, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ కి మధ్య. కొద్ది కాలం గా తెలుగు దేశం కి దూరం గా ఉంటూ వస్తున్న హరి కృష్ణ మరలా యాక్టివ్ అయ్యే దిశగా ఆలోచన చేస్తున్నట్టు గా తెలుస్తుంది. దీనికి సంబంధించి హరికృష్ణ రెండు ప్రపోజల్స్ చంద్రబాబు ముందు ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట. వాటిల్లో మొదటిది

వచ్చే రాజ్యసభలో తనని నామినేట్ చెయ్యాలని కోరబోతున్నారని తెలుస్తుంది. అయితే ఆల్రేడి యనమల ని ఒకే చేశారాని, ఆనక ఆయన వద్దన్నారని ఒక టాక్ ఉంది. గతం లో ఆయనకీ చంద్రబాబు చాలా అవకాశాలు కలిపించారు. తొలుత రాష్ట్ర మంత్రి గా తర్వాత రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. అయినా కాని హరికృష్ణ పార్టి కి దూరం గా జరిగారు. మరలా ఇప్పుడు యాక్టివ్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది. దీనిలో భాగం గా రాజ్యసభ కు నామినేట్ చెయ్యమని కోరే అవకాశం ఉంది. ఒక వేళ అది కాకుంటే తితిదే చైర్మన్ గా అయినా అవకాశం ఇవ్వాలనేది మరొక ప్రపోజల్ గా పెట్టె అవకాసం ఉంది అంటున్నారు. అయితే చంద్రబాబు ఇప్పటికే నాయకులకి పదవులు ఇచ్చే విషయం లో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అంతే కాక తెలుగు దేశం లో కీలక నేత అయిన బాల కృష్ణ తో హరి కృష్ణ కు విభేదాలు ఉన్నాయన్న వార్తలు నిజమే అంటూ ఉంటారు. ఇన్ని చాలెంజ్ మధ్య చంద్రబాబు ఎంత వరకు హరికృష్ణ కు న్యాయం చెయ్యగలరు అనేది ప్రస్నార్ధకమే. అయితే కొందరు పార్టి ముఖ్యులు హరికృష్ణ ని దగ్గర చేసుకుంటే ఒక వర్గం దగ్గర అవుతారు అనే వాదన వినిపిస్తుందట. అయితే గతం లో ఎన్టీఆర్ తెలుగు దేశానికి మాత్రమె ఎలా పరిమితం, ఆయన జాతీయ నేత. వైఎస్సార్సీపి అయినా ఆయన ఫోటోస్ వాడుకోవచ్చు అని అన్న మాటలు సగటు తెలుగు దేశం అభిమాని ఇంకా మర్చిపోయి ఉండరేమో. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ వారం దాటే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here