కింగ్ వల్ల పెద్ద డిజాస్టర్ తప్పించుకున్న చైతు

నాగ చైతన్య అనగానే ఒక బాద్యత గా ఉండే ఒక యువకుడు గుర్తుకు వస్తాడు. మన అన్న లాగానో తమ్ముడు లాగానో, మన స్నేహితుడు లానో ఉండే హీరో చైతు. తోలి సినిమా నుంచి ఇప్పటి వరకు రిస్క్ తీస్కోవటానికి ఆలోచించని చైతు ఇప్పుడు బాక్ టు బాక్ హిట్స్ వచ్చేలా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు చైతు గురించి ఒక ఆసక్తికర విషయం నెట్ లో హల్చల్ చేస్తుంది.

కింగ్ నాగార్జున గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఆయన ఎంత మంది కొత్త దర్శకులని పరిచయం చేసారో తెలిసిందే. నేను దేవుణ్ణి నమ్మను నాగ్ ని నమ్ముతాను అని శివ ద్వారా పరిచయం అయ్యి ఇండియా లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన రాం గోపాల్ వర్మ ఎన్నో సార్లు చెప్పారు. నాగార్జున కి కథల జడ్జ్మెంట్ తిరుగు లేదు అన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కాంబినేషన్ నమ్మి సినిమా తియ్యని ఒకే ఒక స్టార్ హీరో నాగర్జున అంటే అతిశయోక్తి కాదేమో. అటువంటి నాగార్జున ఇండస్ట్రీ కి వచ్చి ముప్పై ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా కొత్త దర్శకులకి అవకాశాలు ఇవ్వటం లో సంశయించటం లేదు అని సోగ్గాడే చిన్ని నాయన తో, తర్వాత రాజు గారి గది-2 తో ప్రూవ్ చేసారు. ఒక పక్క అన్నపూర్ణ స్టూడియోస్, మరొక పక్క ఆయన సినిమాలు చూస్తూ ఆయన కుమారుల సినిమాల మీద కూడా ఒక కన్ను వేసి ఉంచుతారు. గత ఏడాది చైతు, అఖిల్ ఇద్దరికీ రారండోయ్ వేడుక చూద్దాం, హలో తో మంచి హిట్స్ ఇచ్చి, ఆయన రాజు గారి గది 2 తో మరొక హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. గత సంవత్సరం మామ గ ప్రమోట్ అయిన కింగ్ ప్రస్తుతం  ఆర్జీవి దర్సకత్వం లో ఒక చిత్రం చేస్తున్నారు. అలాంటి నాగ్, చైతు ని ఒక పెద్ద డిజాస్టర్ నుంచి కాపాడారు అనే వార్త బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే..

2014 వ సంవత్సరం లో ఆకుల శివ అనే రైటర్ వచ్చి చైతు కి ఒక కథ చెప్పాడట, నాగర్జున తో డమరుఖం తీసిన శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు, సి కళ్యాణ్ నిర్మాత అని, చైతు కథ విని బానే ఉంది అనుకున్నాడట. కాని ఎదో డౌట్ ఉండే సరికి ఒక సారి నాన్న కి చెప్పండి అని శివ కి సూచించాడట. కాని వెంటనే నాగార్జున ని కలవటం శివ కి కుదరలేదట. సి కళ్యాణ్ వచ్చి మంచి రోజులు లేవు, ముందు ముహూర్తం చేసేద్దాం, తర్వాత నాన్న గారికి చెప్దాం అని సూచించాడట. చైతు కొంచెం డౌట్ గానే ఒకే చెప్పినా, తనకి ఎక్కడో ఒక చిన్న  భయం ఉందట. మొత్తానికి రధ సప్తమి రోజున “దుర్గ” అనే పెరుతో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సినిమా రెగ్యులర్ షూటింగ్ ని త్వరలో స్టార్ట్ చేసి జూలై వరకు షూటింగ్ జరుపుకుని రంజాన్ కి విడుదల అని మీడియా రిపోర్ట్ చేసింది. కాని ఇంకా అప్పటికి కింగ్ నాగ్ కథని వినలేదు. ముహూర్తం అయిన తర్వాత నాగార్జున కి కథ వినిపించాడట ఆకుల శివ. అసలు బాలేదు అంటే బాలేదు అని నిర్మొహమాటం గా చెప్పిన నాగ్ మరొక కథ రెడి చేయ్యమన్నారట. చైతు కి అప్పటి వరకు కథ మీద ఉన్న డౌట్ నిజం అని తెల్సిందట.ఆ కథలో కాస్త మార్పులు చేసి ఇంటలిజెంట్ అనే సినిమా తీసారు. ఆకుల శివ కథతో సి కళ్యాణ్ నిర్మించి….

వివి వినాయక్ దర్సకత్వం వహించిన ఈ చిత్రం అతి పెద్ద డిజాస్టర్ గా నిలించింది. ఆవిధం గా కింగ్ ఆయన జడ్జ్మెంట్ తో చైతు ని డిజాస్టర్ నుంచి కాపాడారు అని ఫిలిం నగర్ వర్గాల గుస గుస.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here