MLA మూవీ బుల్లెట్ రివ్యూ

కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎంఎల్ఏ'( మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ వస్తుంది. దాదాపు పన్నెండేళ్ళ తర్వాత కాజల్, కళ్యాణ్ రామ్ కలిసి నటించినటం విశేషం. పటాస్ తర్వాత  మళ్ళి ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రం మీద  భారీ అంచనాలే పెటుకున్నాడు. ఈ చిత్రం ఎలా ఉందొ మా బులెట్ రివ్యు లో చూద్దాం….

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

కళ్యాణ్ రామ్ ఎప్పటిలా బానే చేసాడు. గత చిత్రాలకంటే ఈ మూవీ లో స్టైలిష్ గా కనిపించాడు.

ఇందు గా కాజల్ బావుంది, నటన కు పెద్ద స్కోప్ లేని కారక్టర్ అయినా సినిమా కావాల్సిన గ్లామర్ యాడ్ చేసింది.

MLA గొప్ప కథ ఏమి కాదు కాని, ట్రీట్మెంట్ తో మంచి కథగా చెప్పే అవకాశం ఉంది.

మొదటి సగం అంత కన్ఫ్యూజన్ కామెడి తో సాగిపోతుంది

కామెడి అక్కడక్కడ బావుంది

కొత్త నిర్మాతలు అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

సాంగ్స్ చూడటానికి వినటానికి బావున్నా, స్క్రీన్ప్లే ప్రకారం టైం కి వచ్చెయ్యటం కాస్త ఇబ్బందే.

సెకండ్ హాఫ్ లో సమాజానికి ఎదో చెయ్యాలి అని తపన పడే హీరో కిక్ లో చూసాం, శ్రీమంతుడు లో చూసాం.

ఇంటర్వల్ బ్లాక్, రెండు యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి.

సినిమాటోగ్రఫీ బావుంది, ఎడిటింగ్ బావుంది

ఓవరాల్ గా చుస్తే MLA ఇప్పటికే చాలా సార్లు చుసిన రొటీన్ కమర్షియల్ సినిమా. కొత్తగా ఏమి చెప్పలేదు, పాత కథనాన్ని కొత్త పాకేజీ లో తీసుకుని వచ్చిన మరొక రొటీన్ సినిమా ఇది. కళ్యాణ్ రామ్ పూర్తి స్థాయి కమర్షియల్ హీరో గా మారటానికి చేసిన ఈ ప్రయత్నం పూర్తీ గా సక్సెస్ కాలేదనే చెప్పాలి.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here