వైకాపా కి అనూహ్యమైన షాక్… పార్టిని వీడనున్న కీలక నేతలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జగన్

Advertisements

ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైకాపా బలం గా ఉన్న నెల్లూరు జిల్లా రాజకీయాలు క్రమంగా ఒక రూపు సంతరించుకుంటున్నాయి. జిల్లా మీద ఆధిపత్యం కోసం కొందరు విపరీతం గా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే కొంత మంది ప్రజాప్రతినిధులు పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు రావాలని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో బలమైన సామాజికవర్గమైన


రెడ్డి కులస్తులు గత ఎన్నికల్లో వైకాపానే సమర్థించారు. దాంతో జిల్లాలో మూడు నియోజకవర్గాలు తప్ప మిగతా అన్నిచోట్ల వైకాపానే గెలిచింది. మళ్లీ ఇప్పుడు అటువంటి ఫీట్‌నే పునరావృతం చేయడానికి అధినేత ప్రయత్నాలు చేస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, వైకాపా లో నంబర్ 3 అనగలిగిన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే కూడా అధికార టిడిపిలో చేరతారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి వై.ఎస్‌.జగన్‌తో కలసి ఉన్న మేకపాటికి ఇటీవల కాలంలో జిల్లా పార్టీలో ఉక్కపోత పరిస్థితి ఉందట. ముఖ్యంగా ఇద్దరు రాజ్యసభ సభ్యుల వ్యవహారశైలితో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. అక్రమాస్తుల కేసుల్లో జగన్‌తో పాటు నిందితుడైన విజయసాయిరెడ్డి జిల్లాలో గ్రూపులు కడుతూ తనకు చెక్‌ పెడుతున్నారని ఆయన తీరు సరిగా లేదని మేకపాటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆయన వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని మేకపాటి అంటున్నారట. ఒకవైపు కేంద్రంపై తాము మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తుంటే విజయసాయిరెడ్డి నిత్యం పిఎంఒతో టచ్‌లో ఉంటున్నారని దీని వల్ల ప్రజల్లో తమ పోరాటంపై నమ్మకం ఏర్పడడం లేదని అధినేత జగన్‌ను విజయసాయిరెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన అంటున్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన తరువాత తాము ఏమి చేసినా పార్టీ పుంజుకోదని అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారట. అంతే కాకుండా


నెల్లూరు జిల్లా వ్యవహారాలు మొత్తం మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి జగన్‌ అప్పగించారని దీంతో వేమిరెడ్డి తమపై పెత్తనం చేస్తున్నారని వీరితో వేగడం ఇక తన వల్ల కాదని త్వరలో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని ఆయన చెబుతున్నారు.అయితే తెలుగు దేశం లోకి చేరితే బలం గానే చేరాలని, అలా అయితేనే జిల్లా రాజకీయాలపై పట్టు చుపించుకోవచ్చని భావిస్తున్నారట. అయితే ఈ విషయం మీద స్పష్టమైన సమాచారం జగన్ కి అందటంతో వెంటనే తనను కలవాలని కబురు పెట్టారట. మేకపాటి రేపు జగన్ ని కలిసే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో….

Advertisements

Leave a Reply