TDPని చాలామంది వదిలేస్తారు, కాని 2019లో గెలిచేది 100% మేమే, TDP MP చెప్పిన లెక్క ఇదే

Advertisements

గత సంవత్సరం గుర్తుందా జగన్ ఒక మాట అన్నాడు నేను తలచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది అని. ఆ తరవాత ఒక్కొక్కరు గా షుమారు 23 మంది ఎమ్మెల్యేలు వైకాపా వీడి సైకిల్ ఎక్కారు. అలానే కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏకంగా 40మంది టీడీపీ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌నే రీతిలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేపధ్యంలో ఒక తెదేపా ఎంపి మీడియా తో పిచ్చాపాటి మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గాల సంఖ్య పెరగక పోవటం వల్ల, తెదేపా లో ఓవర్ ఫ్లో లో ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటి కోసం అయినా పార్టి మారాలి కాబట్టి ఇక ముందు తెదేపా నుంచి ఎక్కువగానే నాయకులు వెళ్తారు. కాని ఇక ముందు ఉండే ఈ జంపింగ్స్ అన్ని మనుగడ కోసమే అనుకోవాలి అని చెప్పారట.

అంతే కాకుండా కేంద్రం నియోజకవర్గాల పెంపు చెయ్యనిది కూడా ఇందుకే అని చెప్పారు. అంతే కాకుండా ఒక పక్క జనసేన మరొక పక్క వైసీపీ కూడా అదే స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. త‌న‌తో ట‌చ్ లో ఉన్న వారంద‌రికీ జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని చెప్పాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మ‌రోసారి ఫిరాయింపుల జోరు ఖాయంగా క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి ప‌లువురు నేత‌లు సైకిల్ స‌వారీకి సెండాఫ్ చెప్పేసే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌కు తోడుగా మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. కానీ చంద్ర‌బాబు ని కలిసాక ఆయ‌న వెన‌క్కి తగ్గారు కదా. అదే బాట‌లో మ‌రికొంద‌రు నేత‌లు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయే ఆలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. సర్వే లో పని తీరు బాలేదు అని వచ్చిన వారు పనితీరు మార్చుకోకుండా జగన్ కి టచ్ లోకి వెళ్లారట. అక్కడ అవకాశం లేకుంటే జనసేన వైపు చూస్తున్నారట. గ‌తంలో మాదిరిగా విలువ‌లు, రాజ‌కీయ సిద్ధాంతాలు అనే మాట మ‌ర‌చిపోయిన నేప‌థ్యంలో ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధి కాబ‌ట్టి, ముంద‌స్తుగా సానుకూల‌త ఉన్న పార్టీలో చోటు కోసం ఖ‌ర్చీఫ్ వేసే ఆలోచ‌న‌లో చాలామంది ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు..ఈ నేప‌థ్యంలో వివిధ కార‌ణాల‌తో టీడీపీలో టికెట్ రాదు అనుకున్న నేత‌లు జ‌న‌సేన‌, వైసీపీ ల‌లో

ఏదో ఒక‌టి తేల్చుకోలేక స‌త‌మ‌తం అవుతున్నార‌ని చెప్పుకొచ్చారు. అయితే టికెట్ ఇస్తాం రండి అని ఆహ్వానిస్తున్నా బిజెపి, కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్ళే ఆలోచన చెయ్యట్లేదు అని ఆయన సెటైర్ వేసారట. అవసరం కి మించి ఎక్కువగా అభ్యర్ధులు ఉన్నారు కాబట్టి ముందు ముందు తెలుగు దేశాన్ని నేతలు వీడే అవకాసం ఎక్కువ గా ఉంటుంది, కాని అది తెలుగు దేశం బలహీనపడినట్లు కాదనే సంగతి వేరేగా చెప్పే పని లేదు. తెలుగు దేశం కోరుకుంటుంది కుడా త్రిముఖ పోటినే, అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలుతుంది అని ముక్తాయింపు ఇచ్చారట సదరు ఎంపి.

Advertisements

Leave a Reply