మనసుకు నచ్చింది బుల్లెట్ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని 2002 లో వచ్చిన షో చిత్రం ద్వారా ఫేమస్ అయ్యారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత గత ఏడాది ఆమె దర్సకత్వం లో సినిమా అనగానే చాలా క్యూరియాసిటి వచ్చింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత కిరణ్, మంజుల భర్త సంజయ్ స్వరూప్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించాడు. సందీప్ కిషన్. అమయా దస్తూర్, త్రిధా చౌదరి కలిసి నటించిన ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూ లో నచ్చింది.


ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

అసలు సందీప్ కిషన్ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు

అమయా దస్తూర్ లో మన తెలుగుదనం లేదు

త్రిధా చౌదరి మంచి యాక్టర్ అయిన ఫుల్ లెంగ్త్ రోల్ లభించలేదు

ఈ కాన్సెప్ట్ లో అంత కొత్తదనం ఏముందో అర్ధం కాలేదు

మంజుల రాసుకున్న సబ్జెక్టు లో ఇతర చిత్రాల చాయలు చాలా ఉంటాయి

స్క్రీన్ ప్లే కూడా పాత తరహాలో ఉండడం ప్రేక్షకులు భరించలేని విషయం

హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ గా ఉండి లిప్ లాక్ చేసుకోవడం వంటి సీన్స్ అసలు నచ్చవు.

సినిమా నారేషన్ చాలా స్లో గా ఉంది, సమయం సందర్భం లేకుండానే పాటలు రావడం ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి.

ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరో మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, ఈ సినిమా మరీ పసలేని సన్నివేశాలతో నడుస్తుంది.

మంజుల చెప్పాలనుకున్న పాయింట్ ని ఓపిక పరీక్షించేలా చెప్పారు.

రధన్ సాంగ్స్ అస్సలు ఆకట్టుకోలేదు. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త పర్లేదు.

అత్యద్భుతం అయిన విజువల్స్ చూపించిన సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప సినిమాలో పెద్దగా ఆక్కట్టుకునే అంశాలు ఎం లేవు.

ఓవరాల్ గా ఇలాంటి ప్రేమ కథలు మనం చాలానే చూసాము.ఇందులో కొత్తేమి లేదు. సందీప్ కిషన్ కి మరొక ఫ్లాప్. మంజుల ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం లో విజువల్స్ బావున్నాయి. అంతకు మించి పెద్దగా చెప్పుకునే అంశాలు ఏమి లేవు.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here