రాజధాని జిల్లాలలో ఈ టిడిపి ఎమ్మెల్యే మెజారిటి 35 వేల పైనే అని లక్షల్లో పందాలు?

Advertisements

రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లా గురించి, కృష్ణా జిల్లలో బెజవాడ రాజకీయం గురించి చెప్పే పని లేదు. రాజకీయాలు ఫాలో అయ్యేవారికి బెజవాడ రాజకీయం ఏంటో తెలుసు. ప్రస్తుతం బెజవాడ లో ఉన్న మూడు అసెంబ్లీ, బెజవాడ ఎంపి సైతం తెలుగు దేశం ఖాతాలో ఉన్నాయి. బెజవాడ లో కీలక నియోజకవర్గం తూర్పు. గద్దె రామ్మోహన్ రావు అక్కడ సిట్టింగ్ MLA. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి తాజాగా జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లోకి ఎంట‌ర్ అయిన వెంట‌నే వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ర‌వికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు సీటుపై

జ‌గ‌న్ నుంచి హామీ వ‌చ్చింద‌ట‌. వాస్త‌వానికి ర‌వి ఫ్యామిలీకి చంద్ర‌బాబు ఎంతో చేశారు. అవ‌న్నీ విస్మ‌రించిన ర‌వి చంద్ర‌బాబును కాద‌ని జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. 1999లో ర‌వి తండ్రి య‌ల‌మంచిలి నాగేశ్వ‌ర‌రావుకు చంద్ర‌బాబు కంకిపాడు టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో బాబు ప్రోత్సాహంతో నాగేశ్వ‌ర‌రావు కాక‌లు తీరిన నెహ్రూను ఓడించి రికార్డు క్రియేట్ చేశారు.ఇక ర‌వి 2009లో ప్ర‌జారాజ్యంలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ నుంచి విజ‌య‌వాడ తూర్పులో పోటీ చేసి అతి కష్టం మీద కేవ‌లం 190 ఓట్ల‌తో గెలిచారు. ఆ త‌ర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో కాంగ్రెస్ మ‌నిషి అయ్యారు. గ‌త ఎన్నికల‌కు ముందు ర‌వి బాబు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి టీడీపీలో చేరారు. వ‌చ్చిన వెంట‌నే సీటు ఎలా ఇచ్చేస్తారు. అప్ప‌టికే అక్క‌డ టీడీపీని ద‌శాబ్దాలుగా న‌డిపిస్తోన్న గ‌ద్దే రామ్మోహ‌న్ ఉన్నారు. బాబు గ‌ద్దేకే టిక్కెట్ ఇచ్చారు.
గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత అయినా ర‌వి పార్టీ కోసం చేసిందేమి లేదు. పార్టీ మారుతాన‌ని ఫీలర్లు ఇవ్వ‌డంతో కేశినేని నాని ఆయ‌న్ను బాబు వ‌ద్ద‌కు తీసుకువెళ్లారు. బాబు ఆయ‌న‌కు, MLA సీట్ కష్టం కాని మంచి నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని కూడా హామీ ఇచ్చారు. అయినా పార్టీలు మార‌డం అల‌వాటు అయిన ర‌వి మ‌ళ్లీ వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. పార్టీ మారినంత మాత్రాన ఆయ‌న విజ‌య‌వాడ‌లో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చేసేదేం లేదు.కారణం ఏంటంటే

2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న తూర్పు నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసినా ఆయ‌న ఓడ‌డం ప‌క్కా. ఇప్ప‌టికే గ‌ద్దే అక్క‌డ దూసుకు పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ గ‌ద్దె 16 వేల ఓట్ల‌తో గెలిచారు. ఇక్క‌డ దేవినేని నెహ్రూకు కాంగ్రెస్ నుంచి 14 వేల ఓట్లు వ‌చ్చాయి… లేక‌పోతే ఈ మెజార్టీ మ‌రింత పెరిగేది. నెహ్రూ అభిమానులు, క‌మ్మ వ‌ర్గంలో కొంత‌మంది నెహ్రూకు ఇమేజ్ దృష్ట్యా ఆయ‌న‌కు ఓటేశారు. లేక‌పోతే గ‌ద్దేకు స‌లువుగానే 25 వేల మెజార్టీ వ‌చ్చేది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ర‌వి పోటీలో ఉన్నా ఆయ‌న‌కు క‌మ్మ సామాజిక వర్గం లోనే ఎక్కువ మంది ఓటేసే ప‌రిస్థితి ఉండ‌దు. దానికి కారణం గద్దె రామ్మోహన్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పోయే నేత కావటం, ఆ నియోజక వర్గం లో కమ్మ సామాజిక వర్గం తెలుగు దేశానికీ ఆయువు పట్టుగా ఉండటం. ఇక గ‌ద్దేకు బీసీ, ఎస్సీల‌తో పాటు వ్యాపారులు, ఉద్యోగులు, యువ‌త బ‌లంగా అండ‌గా ఉంటున్నారు. ఇక కాపుల్లో జ‌న‌సేన‌కు కొన్ని ఓట్లు ప‌డినా గ‌ద్దేకు కులాలు, మ‌తాలు, వ‌ర్గాల‌కు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఇక్క‌డ అంచనాలని బ‌ట్టి చూస్తే జ‌న‌సేన ర‌విని మూడో ప్లేస్‌కు నెట్టేసి జ‌న‌సేన రెండో ప్లేస్‌లోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఇప్పుడు బలం అయిన దేవినేని వర్గం కూడా

తెలుగు దేశంలోనే ఉండటంతో ఓవ‌రాల్‌గా గ‌ద్దేకు క‌నీసం 35 -40 వేల మెజార్టీ ఈజీగా వ‌చ్చే ఛాన్సుంది. ఫైన‌ల్‌గా టీడీపీని కాద‌ని వైసీపీలోకి వెళ్లిన ర‌వి రెండో ప్లేస్ సాధించినా రికార్డే అవుతుంది అని పందాలు కడుతున్నారు. గద్దె మెజారిటి 35వేల పైనే అని లక్షల్లో పందాలు కడుతున్నారని సమాచారం.

Advertisements

Leave a Reply