కృష్ణార్జున యుద్ధం బుల్లెట్ రివ్యూ

Advertisements

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని ద్విపాత్రాభినయంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నానీ సరసన టాలీవుడ్ క్యూటీ అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ దిల్లాన్ కథానాయికలుగా నటించారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్,ఎక్స్ప్రెస్ రాజా హిట్లతో మంచి ఊపు మీద ఉన్న మేర్లపాక గాంధి ఈ చిత్ర దర్శకుడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

ప్రత్యేకం గా ఈ సినిమాలో నాని బాగా చేసాడు అని చెప్పటానికి ఏమి లేదు

రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నాని బాగా చేసాడనే చెప్పుకోవాలి

అనుపమ పరమేశ్వరన్ కి మంచి రోల్ లభించింది

కొత్త అమ్మాయి రుక్సర్ ధిల్లాన్ పరిధి మేరకు బాగా చేసింది

ధ్రువ తో పరిచయం అయిన హిప్ హాప్ తమిళ సంగీతం రెండు పాటలు తప్పితే గొప్పగా ఏమి లేదు
సినిమాటోగ్రఫీ బావుంది

ఎడిటింగ్ మీద కాస్త దృష్టి పెట్టి ఉంటె బావుండేది

మొదటి సగం ఎంటర్టైన్మెంట్ తో చాలా గ్రిప్పింగ్ గా సాగిపోతుంది

రెండవ సగం లో సినిమా బాగా నెమ్మదిస్తుంది, అంతే కాకుండా కొన్ని సన్నివేశాలు బలవంతంగా చొప్పించినట్టు అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ బాగా నేమ్మదించటం వల్ల సినిమా అనుకున్నాన గొప్పగా లేదు అనిపిస్తుంది.

దర్సకుడుగా మేర్లపాక గాంధీ పర్లేదు అనిపిస్తాడు

ఓవరాల్ గా కృష్ణార్జున యుద్ధం మరొక నాని సినిమా, కృష్ణగా నాని అలరించిన బాగా నిదానం గా ఉన్న సెకండ్ హాఫ్ ఈ సినిమా కి ఎఫెక్ట్ అవుతుంది. కాని నాని ప్రస్తుతం ఉన్న గోల్డ్ రన్ లో సినిమా ఒక మోస్తరు గా ఉన్న్న ఆడేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన MCA కూడా అలా ఊహకి అందకుండా ఆదేసిందే. వేసవి కాలం అవ్వటం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 2.75/5

Advertisements

Leave a Reply