కిరాక్ పార్టీ బుల్లెట్ రివ్యూ

Advertisements

వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ దూసుకు పోతున్న యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిరాక్‌ పార్టీ. ప్రయోగాలను పక్కన పెట్టి కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన కిరిక్‌ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్‌ పార్టీ పేరుతో రీమేక్‌ చేశాడు నిఖిల్. చాలా కాలం తరవాత నిఖిల్ పూర్తిస్థాయి విద్యార్థి పాత్రలో నటించాడు. ఇంజినీరింగ్ క్యాంపస్, సీనియర్స్ జూనియర్స్ గొడవలు, ప్రేమ వంటి అంశాలు కలగలిపిన కథ ఇది. శరన్‌ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కు ప్రముఖ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే , మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు అందిచడం విశేషం. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు (మార్చి 16న) విడుదలైంది. ఈ చిత్రం నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్‌ గా నిలిచిందా..? ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్‌ సినిమా చేసిన నిఖిల్ మరో విజయం సాధించాడా..?

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

హీరో నిఖిల్ పాత్రలో వివిధ షేడ్స్‌ కనిపిస్తాయి. అల్లరి చిల్లరి యూత్ గా మెప్పించాడు. సెకండాఫ్‌లో సీనియర్ స్టూడెంట్‌గా అమ్మాయిలను ఏడిపిస్తే తాట తీసే లీడర్‌గా పర్వాలేదు.

ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్‌ గా కనిపించిన సిమ్రాన్‌ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది

మరో హీరోయిన్‌ సంయుక్త సెంకడ్‌హాఫ్‌ లో జోష్ కోసం ప్రయత్నం చేసింది.

కాలేజ్ సీన్స్ లో చాలా మంది తమ కాలేజ్ లైఫ్ గుర్తు చేసుకుంటారు

పాటలు బావున్నాయి కాని, కన్నడ తో పోలిస్తే పిక్చరైజేషన్ ఆకట్టుకోలేదు అని చెప్పాలి

సెకండ్ హాఫ్ చాలా స్లో స్పీడ్ లో ఉంటుంది, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి

చాలా కీలకమైన ఎమోషనల్ సీన్స్ లో కొత్త దర్శకుడు శరన్ తడబడ్డాడు

అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ బాగుంది.

ఎంఆర్ వర్మ‌కు ఎడిటర్‌గా చాలా పని మిగిలిపోయిందనే భావన కలుగుతుంది.

అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ బానే ఉంది

ఓవరాల్ గా ఈ సినిమా కి మెయిన్ లోపం రెండు గంటల నలభై ఐదు నిమిషాల రన్ టైమ్ తో పాటు రోటీన్ కథ, అంత కంటే పేలవమైన కథనం ఈ సినిమా కి శాపాలు గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ లో కాలేజి సన్నివేశాల కోసం ఒక సారి చూడొచ్చు

ఆంధ్రుడు రేటింగ్ : 2.5/5

Advertisements

Leave a Reply