Funny Video : ఆంధ్రా కు మద్దతుగా మాట్లాడుతూ మోడీ ఇజ్జత్ తీసేసిన KCR

కెసిఆర్ విభజనకు ముందు ఎం మాట్లాడినా, విభజన తర్వాత అన్ని మాటలు నీటి మూటలు అయ్యాయ్. రామోజీ ఫిలిం సిటి ని లక్ష నాగళ్ళతో దున్నిస్తాం అనే దగ్గర నుంచి చాలా వాగ్దానాలు కొండెక్కాయి. కొండెక్కాయి అనే కంటే ఆయనకీ చేసే ఉద్దేశం లేదు అని అనుకోవచ్చు.ఆయన రాష్ట్రం లో ఆయనకీ నచ్చిన పాలన జరుగుతుంది. అది పక్కన పెడితే తెలుగు దేశం చేస్తున్న ఆందోళన కి తెరాస పార్టి మద్దతు ఇవ్వటం తో..

పాటు స్వయంగా నిజామబాద్ ఎంపి కవిత సైతం జై ఆంధ్రా అని తన ప్రసంగాన్ని ముగించారు. ఇవన్ని తెలంగాణా లో ఉన్న ఆంధ్రా వాళ్ళని తమ దారికి తెచ్చుకోటానికి అని భావించవచ్చు. అయితే కెసిఆర్ ఒక సందర్భం లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నేట్టింట్లో హల్చల్ చేస్తుంది.కెసిఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మోడీ అమరావతి కే ఇవ్వలేదు, మనకేం ఇస్తారు అంటూ మోడీ గురించి వ్యాఖ్యలు చేసారు. అంతే కాక తాను అమరావతి శంఖుస్థాపనకి వెళ్ళే ముందు తెలంగాణా ప్రాంతానికి చెందిన కొందరు మేధావులు, కాబినెట్ మంత్రులు సైతం కొత్త గా రాజధాని కట్టుకుంటున్నారు మన రాష్ట్రం తరపు నుంచి ఎమన్నా డబ్బు అనౌన్స్ చేసి రండి అని చెప్పారు. నేను ఇవ్వాలనే అనుకున్నాను. అక్కడ సభలో అనౌన్స్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. తీరా అక్కడికి వెళ్ళాక మోడీ ముందు రెండు కుండలు పెట్టారు. నేను వెంకయ్య గారిని అడిగాను, ఆ కుండ లో ఏంటి అని? ఒక కుండ లో మట్టి, ఒక కుండ లో నీళ్ళు అన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి ఏమి ప్రకటన లేదా అన్నాను? లేదు అన్నారు….ఇంకా ఆయన ఇవ్వకుండా నేను ఇస్తే బాగోదు అని ఆగిపోయాను. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 2019లో థర్డ్ ఫ్రంట్ అంటూ వస్తే అందులో కలిసే మొదటి పక్షాల్లో ఒకటి అని భావిస్తున్న తెరాస నుంచి ఇటువంటి కామెంట్స్ సర్ప్రైజింగ్ గా లేవు. వాళ్లకి రేపు ఎన్నికల్లో తెలుగు దేశం కాడర్ ఓట్స్ కూడా కావలి అనేది వాళ్ళ కోరిక లా కనపడుతుంది. .ఏది ఏమైనా ఎవరి కారణాలు ఎలా ఉన్నా, తెలుగు దేశానికి దెస స్థాయి లో పెరుగుతున్న మద్దతు, మోడీ అండ్ కో ని ఇబ్బందుల్లో పెడుతుంది. వారికి ఆంధ్రుడు సత్తా తెలుస్తుంది… ఆ వీడియో మీ కోసం….చూసి షేర్ చెయ్యండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here