FULL DETAILS : కర్ణాటక లో సంచలనం రేపుతున్న తాజా సర్వే .. BJP కి అంత ఎడ్వాంటేజ్ దేనికి?

కర్ణాటక లో మరొక రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ మరొక పక్క బిజెపి హోరాహోరి గా ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు కాక ప్రతి ఎన్నికల్లో 25 నుంచి 30 దాకా సీట్లు గెలిచే అవకాశం ఉన్న జేడియు(ఎస్) ఉండనే ఉంది. సినీ నటుడు ఉపేంద్ర సైతం ఒక రాజకీయ పార్టి ని గత అక్టోబర్ లో అనౌన్స్ చేసి, జనవరి నెలాఖరుకు మానిఫెస్టో సైతం విడుదల చేస్తారని చెపారు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో గత మార్చ్ 6 న తను అనౌన్స్ చేసిన పార్టి కి తనే రాజీనామా చేసారు ఉపేంద్ర. బిజెపి లో జాయిన్ అవుతారని వార్తలు సైతం వచ్చాయి. అయితే ఉపేంద్ర రాజకీయాల్లోకి రాక ముందు నుంచే బిజెపి లోకి వస్తారు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం మీద ఇంకా స్పష్టత రాలేదు.

ఈ నేపధ్యంలో కర్ణాటక లో వచ్చిన ఒక తాజా సర్వే ప్రకంపనలు సృష్టిస్తుంది. మరొక రెండు నెలల్లో ఎన్నికలు రానున్న నేపధ్యం లో అత్యంత విశ్వసనీయత ఉన్న ADR-దక్ష్ అనే సంస్థ పబ్లిక్ పల్స్ పట్టుకోవటం జరిగింది. ఈ తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి సిద్దరామయ్య పాపులారిటి “అన్న భాగ్య”, “సైకిల్ భాగ్య” స్కీమ్స్ బాగా ఉపయోగ పడ్డాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అన్న భాగ్య(ఉచిత బియ్యం) పధకం అద్భుతం అని 79% మంది, సైకిల్ భాగ్య స్కీం బావుంది అని 63% మంది అభిప్రాయ పడ్డారు. అంతే భాగ్య బ్రాండ్ స్కీమ్స్ లో షాది భాగ్య బాలేదని ఎక్కువ మంది అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉండగా రికార్డు స్థాయిలో 86% మంది ఎమ్మెల్యే అభ్యర్ధి ని పట్టి వోట్ వేస్తామని చెప్పగా, 67% మంది పార్టి ని బట్టి, 42% మంది ముఖ్యమంత్రి అభ్యర్ధి ని బట్టి వోట్ వేస్తామని చెప్పారట. ఈ నేపధ్యంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న యడ్యూరప్ప ని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నది గమనార్హం. మతం చూసి వోట్ వేస్తామని 37% మంది,కులం ముఖ్యం అని 36% మంది చెప్పారట. అయితే సంఖ్యాపరం గా ఎక్కువ గా ఉన్న దళిత్,మైనారిటి, బిసి లు ఎప్పటి నుంచొ కాంగ్రెస్ తో ఉంటె, రెండు మేజర్ కులాలు అయిన లింగాయత్స్ బిజెపి తో, ఒక్కలిగా వారు

JDU తోనూ ఉన్నారు అనేది తెలిసిందే. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పాపులర్ గా ఉన్న వర్గాలను ఆకట్టుకునే పధకాలు సిద్ద రామయ్య చేసారు. అయితే బిజెపి గ్రాఫ్ తాజా గా డ్రాప్ అవుతున్నట్టు తెలుస్తుంది. షుమారు 5% మంది తెలుగు మాట్లాడేవారు ఉన్న కర్ణాటక లో బిజేపే వ్యతిరేకత ను ఎదుర్కుంటుంది. బిజెపి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన విభజన హామీలు దేనికి నెరవేర్చలేదు అని అక్కడ ప్రజలు అడగటం ఆ పార్టి ని కలవర పెడుతుంది. ఉన్న 225 నియోజకవర్గాలలో షుమారు 35 నుంచి 40 నియోజకవర్గాల్లో కీలకం గా ఉన్న తెలుగు ఓటర్లు అత్యంత ముఖ్యం గా మారారు. ఇప్పుడు తాజా గా ఉన్న పరిస్థితి చుస్తే చాలా చాలా టైట్ ఫైట్ ఉంది. షుమారు 90 నుంచి 95 సీట్లలో కాంగ్రెస్, 85 నుంచి 90 సీట్లలో బిజెపి, 25 నుంచి 30 సీట్లలో JDU పటిష్టంగా కనిపిస్తున్నాయి. అయితే షుమారు పదేళ్ళు గా అధికారానికి దూరంగా ఉన్న JDU ఎన్నికల తర్వాత బిజెపితో కలిసి ప్రభుత్వం ఫార్మ్ చేస్తుంది అన్న వార్తలు సైతం వస్తున్నాయి.బిజెపి సైతం ఈ ఎన్నికలు కీలకం కావటం తో మాజిక్ నంబర్ 113 చేరటానికి అందరిని “కలుపుకు పోవాలని”, ఏమి అవసరం అయిన చెయ్యాలన్న లెక్కలో ఉంది. అంతే కాక రాజ్యసభ ఎన్నికల్లో సైతం JDU తో సిద్దరామయ్య కలిసి పని చెయ్యటానికి ఇంటరెస్ట్ చూపకపోవటం గమనించాల్సిన విషయం. తొలుత మాట్లాడుకున్నట్టు సిని నటుడు ఉపేంద్ర సైతం బిజెపి వైపు మొగ్గు చూపుతూ ఉండటం తో బిజెపి కి ఎడ్వాంటేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే బిజెపి కి దూరం అవుతున్న తెలుగు ఓటరు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయితే లెక్కలు వేగం గా మారే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో సైతం భారీ మెజారిటి లో రావనే ఎవరి గెలిచినా నాలుగంకెల మెజారిటి అనే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here