బెజవాడ కొట్టిన ‘కమ్మ’ని దెబ్బకి మూడో రోజే జగన్ కి మాటర్ అర్ధం అయ్యింది

Advertisements

ఎవరు అవునన్నా కాదన్నా… రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. రాజధానికి రైతులు భూములు లాక్కున్నారని విమర్శించినా ఎక్కడా కూడా అది రైతుల్లో కనపడకపోవడం విశేషం. దీనితో విపక్షం సహా ఎంత మంది ఎన్ని ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు ఎక్కడా కూడా అనుకున్నది సాధించుకోలేకపోయారు. చివరికి రైతులను రెచ్చగొట్టినా… కోర్ట్ కి వెళ్ళినా ప్రభుత్వంపై మద్దతు మాత్రం ఏమి తగ్గలేదు అనేది వాస్తవం.. దానికి తోడు ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉండటం.. కూడా టిడిపికి కలిసి వచ్చింది.

దీనితో జగన్ రాజధాని ప్రాంతంపై పట్టు పెంచుకునే ప్రయత్నాలను తీవ్రం చేసారు. ఇందుకోసం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని, వారికే సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు జగన్. అందుకోసమే తనకు నమ్మకంగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడా జగన్ పక్కన బెట్టినట్టు తెలుస్తుంది. జగన్ పాదయాత్రలో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించలేదని ఆ పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. అంటే మంగళగిరిలో కూడా కమ్మ సామాజిక వర్గ నేతకే సీటు ఇవ్వాలని ఆయన భావించారు. ఇప్పటికే విజయవాడకు సంబంధించి ఏంవిఆర్ చౌదరి… తాజాగా పార్టీలో చేరిన యలమంచిలి రవికి సీట్లు ఇవ్వాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ జగన్ వ్యూహం తొలుత తెలుగుదేశం పార్టీ నేతలను కాస్త ఇబ్బంది పెట్టినట్టు కనిపించింది. రాజధాని ప్రాంతం నుంచి కృష్ణా జిల్లాకు జగన్ పాదయాత్ర వచ్చిన సమయంలో భారీగా ప్రజలు హాజరయ్యారు. అయితే దీని వెనుక  మాత్రం వైకాప నేతలు గట్టి హో౦ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా వస్తే దానిని అధికారిక మీడియాలో పదే పదే చూపిస్తే ప్రజలకు ఒక అభిప్రాయం కలుగుతుందని తద్వారా.. తాము బలపడవచ్చని భావించారట. అందుకే ఖమ్మం, నల్గొండ, కడప, ప్రకాశం మరియు గోదావరి జిల్లాల నుంచి ప్రజలని సమీకరించినట్లు అక్కడ నాయకులు తెలిపారు. వీరేకాకుండా కొత్తగా పార్టీలో చేరిన కృష్ణా జిల్లా నేతలు కూడా తమ స్థాయిని

జగన్ కి తెలియచేయాలని భావించి భారీగా జన సమీకరణ చేసినట్లు అర్ధం అవుతుంది. అయితే కమ్మ సామాజిక వర్గ నేతలు వచ్చేసారు కాబట్టి కమ్మ సామాజిక వర్గ ఓటు చీల్చవచ్చు అని ప్లాన్ చేసిన జగన్ కి మూడో రోజున కమ్మని దెబ్బ తగిలిందట. అసలు వచ్చిన నేతల వెనుక కమ్మ సామాజిక వర్గం ఎంత మంది వచ్చారు అని చూస్తే పెద్దగా ఎవరు లేరని తెలిసింది. పార్టిలో చేరిన నాయకుల వెంట వారి ముఖ్య అనుచరులు కూడా రాలేదని తెలిసింది, మొత్తానికి కమ్మ సామాజిక వర్గాన్ని చీల్చవచ్చు అని ఆశించిన జగన్ కి ముందే చుక్కలు కనపడ్డాయి. ఇప్పుఉద్ అట్టహాసం గా పార్టి లో చేర్చుకున్న వారిని ఏమి చెయ్యాలో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారు వైకాపా నేతలు.

Advertisements

Leave a Reply