ANALYSIS : జనసేన ఆత్మహత్య లాంటి నిర్ణయం… 2019 లో పోటి చెయ్యదా?

Advertisements

పార్టి ప్రారంభించి నాలుగేళ్ళు దాటినా ఇప్పటి వరకు సంస్థాగత నిర్మాణం కాని, కనీసం నియోజకవర్గానికి ఒక పార్టి ఆఫీస్ కాను, వార్డు కి ఒక జెండా దిమ్మె కాని లేని పార్టి జనసేన. పవన్ కళ్యాణ్ తప్పితే చెప్పుకోదాగిన నాయకులు కుడా లేరు. అయితే ఇప్పటికే ఒక సామాజికవర్గానికి చెందిన పార్టిగా ముద్ర పడిన జనసేన కి కనీసం అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు లేరు. ఇప్పటికి జనసేన  ఏమి చేస్తుంది, దేనికి జనసేన కి ఓటు వెయ్యాలి అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న జన సేన ఆత్మా హత్య కి సమానం అయిన నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…


స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని.. కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని జనసేన పశ్చిమగోదావరి జిల్లా పరిశీలకుడు బొమ్మదేవర పద్మనాభ శ్రీధర్‌ పిలుపునిచ్చారు. స్థానిక గమిని పంక్షన్‌ హాల్లో ఆదివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ కోట్లాది రూపాయాల సినీ పారితోషికాన్ని కాదని ప్రజలకు సేవచేయలని జనసేన పార్టీ పేట్టారన్నారు.ఎలాంటి వారికి సీట్లు ఇవ్వాలనేది పార్టీ ప్రకటిస్తుందన్నారు. కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ముఖాముఖి సమావేశం నిర్వహించామని తెలిపారు. నివేదికను కార్యకర్తల వద్ద నుంచి సేకరించి అధిష్ఠానానికి పంపుతున్నట్లు తెలిపారు. కలవకొలను తులసి మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా పరిశీలకుల బృందం పర్యటించి వివరాలు సేకరిస్తుందన్నారు.ఈ నివేదిక ఆధారంగానే మండల, గ్రామ కమిటీల నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు. యాతం నగేష్‌ మాట్లాడుతూ ప్రజలకు నీతివంతమైన పాలన అందించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని పెట్టారన్నారు. జనసేన సభ్యత్వం తీసుకున్నవారిలో 60 శాతం యువత ఉందని వెల్లడించారు.  అయితే పార్టి నిర్మాణం జనసేన నేతలు భావిస్తున్నట్టు అలా చిటికే వేస్తె ఇలా రడి అవ్వదు అని, దానికి చాలా కష్టపడి చెయ్యాలని అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఎన్నికల నాటికి కూడా జనసేన నిర్మాణం పూర్తీ కాదని, అలాంటిది సెప్టెంబర్ అక్టోబర్ లో జరుగుతాయి అని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక జనసేన పోటి చేస్తే,

దారుణమైన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయని, అక్కడ ఫలితాలు సాధించకపోతే  సాధారణ ఎన్నికల నాటికి పార్టీ బలహీనపడుతుంది అని ఒక రకం గా ఇది ఆత్మహత్య అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం లేదేమో అని జోకులు వేస్తున్నారు.

Advertisements

Leave a Reply