పిచ్చెక్కిస్తున్న జైసింహ రిలీజ్ స్ట్రాటజీ

Advertisements

సంక్రాంతికి సినిమాలు చాల వస్తుంటాయ్, కాని సంక్రాంతికి సినిమా కి రిలీజ్ చేసి హిట్స్ సూపర్ హిట్స్ కొట్టిన హీరోలలో అగ్రస్థానం నందమూరి బాలకృష్ణదే. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మినరసింహ,గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్స్ ని సంక్రాంతి సీజన్ లోనే కొట్టాడు బాలయ్య. కాగా బాలయ్య వచ్చే సంక్రాంతికి జై సింహాతో దూసుకువస్తున్నాడు. ఈ సంక్రాంతికి బరిలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అజ్ఞాతవాసి కూడా బరిలో ఉండటంతో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. గత వారం విజయవాడలో జరిగిన ఆడియో ఫంక్షన్ లో బాలయ్య తనదైన శైలితో జై సింహా చిత్ర డైలాగ్స్ చెప్పి ఫాన్స్ ని ఉర్రుతలూగించాడు.

భారి అంచనాలతో వస్తున్న జై సింహా ట్రైలర్ చూడటానికి రొటీన్ మాస్ సినిమాలా ఉన్నా, కే ఎస్ రవి కుమార్ మంచి సెంటిమెంట్ తో రంగరించి ఈ చిత్రాన్ని సిద్దం చేసాడట. సెంటిమెంట్ సీన్స్ కుటుంబ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి అనటంలో సందేహం లేదని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేసి వీలైనంత త్వరగా సెన్సార్ కి పంపించాలి అని ప్లాన్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది. అంతేకాక ఈ చిత్ర రిలీజ్ స్ట్రాటజీ కూడా ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ చిత్ర నిర్మాత సి కళ్యాణ్ జై సింహా మీద విపరీతం అయిన కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

జై సింహా సినిమా కొనటానికి వస్తున్న బయ్యర్స్ తో, తాను సినిమా చూసా అని తనకి అమ్మే ఉద్దేశం లేదు అని సొంతగా రిలీజ్ చేసుకుంటా అని చెప్పారట. అంతేకాక ఉత్తరాంధ్రకి చెందిన డిస్ట్రిబ్యుటర్తో పిచ్చా పాటి మాట్లాడుతూ జై సింహాలో  బాలయ్య గారి నట విశ్వరూపం చూస్తారని,ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని తమ చిత్రం లో చెయ్యటం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారట. ఈ చిత్రం మొత్తాన్ని తానే సొంతం గా రిలీజ్ చేస్తా అని, వచ్చిన లాభాల్లో కొంత శాతం బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ కి విరాళంగా ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయ్యా అని చెప్పారట. ఈ సంగతి తెలిసిన బయ్యర్లు సి కళ్యాన్ కాన్ఫిడెన్స్ చూసి ఈయన రిలీజ్ స్ట్రాటజీ బావుంది, మొత్తం సినిమా ని సొంతగా రిలీజ్ చేస్తే సినిమా కలెక్షన్స్ మీద ఆయనకే పూర్తీ స్థాయి కమాండ్ ఉంటుంది. కే ఎస్ రవి కుమార్ కూడా తనదైన రోజున చెలరేగిపోయే దర్శకుడు , కాబట్టి సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్తున్నారట. ఈ మధ్యకాలంలో హైబడ్జెట్ సినిమాల్లో సొంత గా నిర్మాత రిలీజ్ చేస్తానన్న చిత్రం ఇదే అవ్వటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisements

Leave a Reply