జైసింహ సంగతేంటి?

Advertisements

సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ.ఆ పండుగ సందర్భంగా చాలా  సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కాని సంక్రాంతి కి ఎక్కువ సూపర్ హిట్స్ కొట్టిన లిస్టు లో తోలి స్థానం మాత్రం బాలకృష్ణదే. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మినరసింహ,గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్స్ ని సంక్రాంతి సీజన్ లోనే కొట్టాడు బాలయ్య. రేపు అజ్ఞాతవాసి రిలీజ్ అవుతుండగా,రెండు రోజుల గాప్ లో జనవరి 12 న జై సింహ గా బాలయ్య అడుగు పెట్టబోతున్నాడు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి సి కళ్యాణ్ నిర్మాత. 

ఈ చిత్ర కథ విషయానికి వస్తే నరసింహ లాంటి సూపర్ డూపర్ హిట్స్ తీసిన కీస్ రవి కుమార్ మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన చాలా తెలివిగా కథ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. బాలయ్య మీద యాక్షన్ ఎలాగు వర్క్ ఔట్ అవుతుంది. యాక్షన్ తర్వాత బాలయ్య మీద బాగా వర్క్ అవుట్ అయ్యేది సెంటిమెంటే కాబట్టి, ఈ రెండిటిని సమపాళ్ళలో రంగరించి సిద్దం చేసిన కథ జై సింహా అని తెలుస్తుంది. ఈ కథలో కాస్త ముత్తు షేడ్స్ ఉంటాయి. ముత్తు లో యాక్షన్ కంటే కాస్త ఎక్కువ సెంటిమెంట్ పాళ్ళు ఉంటాయి, అలానే జై సింహ కథ కూడా తయారు చేసారట. ఈ చిత్రం లో డైలాగ్స్ విషయానికి వస్తే అన్ని బాలయ్య సినిమాల్లాగా ఎప్పటిలాగా బాగా పవర్ఫుల్ గా ఉంటాయట. బాలయ్య నుంచి అభిమానులు ఆశించే విధంగా కొంత పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్స్ కూడా ఉంటాయట.RK బీచ్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ ఈ చిత్రానికి మేజర్ హైలైట్ గా తెలుస్తుంది. అంతే కాక నేటి తరం డాన్స్ కోరియోగ్రాఫర్స్ కంపోజ్ చేసిన కొత్త తరం ట్రెండి స్టెప్స్ మరొక మేజర్ హైలైట్ గా తెలుస్తుంది. నయనతార,బాలకృష్ణ ఎంత గొప్ప సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది చెప్పే పనిలేదు. ఆ జోడి ఈ చిత్రానికి మరొక స్పెషల్ ఎట్రాక్షన్ గా తెలుస్తుంది.

ఉత్తరాంధ్రకి చెందిన డిస్ట్రిబ్యుటర్తో పిచ్చాపాటి మాట్లాడుతూ జై సింహాలో  బాలయ్య గారి నట విశ్వరూపం చూస్తారని,ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని తమ చిత్రం లో చెయ్యటం తనకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత సి కళ్యాణ్ చెప్పారట. ఈ చిత్రం లో వచ్చిన లాభాల్లో కొంత శాతం బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ కి విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారట నిర్మాత. కే ఎస్ రవి కుమార్ కూడా తనదైన రోజున చెలరేగిపోయే దర్శకుడు , కాబట్టి సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్తున్నారట. సంక్రాంతి కి ఈ రెండు చిత్రాలే కాక “స్పెషల్ చబ్బీస్” రీమేక్, సూర్య నటించిన గాంగ్, రాజ్ తరుణ్ నటించిన రంగుల రాట్నం కూడా రిలీజ్ అవుతున్నాయి. కాని ముఖ్య పోటి మాత్రం అజ్ఞాతవాసి జై సింహ చిత్రాల మధ్యలోనే ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisements

Leave a Reply