జగన్ పాదయాత్ర ఒక్క రోజు ఖర్చు తెలిస్తే కళ్ళు తేలేస్తారు : చిత్తూరు జిల్లా నేత చెప్పిన లెక్క ఇది

Advertisements

ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నేత గత వారం చిత్తూరు జిల్లా నేత కి కాల్ చేసి అన్న ఎలా ఉంది రెస్పాన్స్ అని అడిగాడంట. మనకి వచ్చే వాళ్ళు కాక కొంతమందిని తోలినాము. వాళ్ళ మీద కొంచెం లెక్క అయ్యింది. జగనన్న అయితే హాపి అన్నాడట. చూస్తా ఉన్నాను అన్న, మంది బానే నింపావు అన్నాడట. అంతే కాకుండా పని లో పనిగా ఖర్చు మనదే కాని, ఎంత అయ్యింది అన్న అన్నాడట.దానికి సదరు చిత్తూరు నేత జగనన్న బాగా చేసావు అనాలి అంటే బాగా ఖర్చు అవుతుంది, మనలో మన మాట గా ఉంచు అని లెక్క చెప్పాడట.ఇదే ఆ లెక్క…

జగనన్న నియోజకవర్గంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నియోజకవర్గ ఇన్చార్జీ లేదా ఎమ్మెల్యే ఎవరుంటే వారే అన్నీ చూసుకోవాలి. స్వాగతం పలికే దగ్గర నుంచి నియోజకవర్గం నుంచి వీడ్కోలు పలికే వరకూ అన్ని మనమే భరించుకోవాలి. ఇక్కడ జగనన్న ఓపిక ఉన్న్న్నత వరకు నడుస్తాడు. మరి జగనన్న వెనుకాలా వచ్చే ఆయన స్టాఫ్ వాళ్ళు ఉంటారు గా, వాళ్ళే ఎంత లేదన్నా 50 వాహనాలకు ఏమాత్రం తక్కువ లేకుండా ఉంటారు. రోజు ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిపోయేవారితో కలుపుకుంటే 500 వాహనాలపైమాటే ఉంటుంది. స్టాఫ్ మొత్తానికి భోజనాలు, వసతి ఏర్పాట్లు, జగన్ ఉండే బస్సు ఖర్చు, జనాలు ఉండేందుకు వసతి ఇవన్నీ కూడా పాదయాత్రను నిర్వహించే వారి ఖాతాలో ఉండిపోతాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో రూట్ మ్యాపును అనుసరించి సరాసరి 30 నుంచి 50 కిలోమీటర్లు పైనే ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్రలో ఉన్నారంటే నియోజకవర్గ జనం రోజుకు వెయ్యిమందిని సమీకరించాలి. వాళ్లకి కనీసం 50 వాహనాలను ఏర్పాటు మనమే చెయ్యాలి. వాళ్ళలో ఒక్కొక్క మనిషికి రోజుకు కనీసం రెండువందల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఆ లెక్కన ఇక్కడే రెండు లక్షల రూపాయిలు ఖర్చు కనపడుతుందా? ఇక వారి భోజనాలు మూడు పూటల ఖర్చు మరో రెండు లక్షలు ఉంటాయి. ఇక వాహనాలు 50 వాహనాలంటే నాలుగు వేల రూపాయల

చొప్పున అనుకున్నా కనీసం రెండు రూపాయల ఖర్చు వస్తుంది. పైనవన్నీ ఒక లెక్క, అవి కాక స్వాగత తోరణాలు, బ్యానర్లు,ప్రచారరథాలు, మేళాలు,డప్పులు,మైక్ సెట్లు ఇవన్ని ఉంటాయి గా. ఇవి పెట్టే స్థాయి అనుసరించి 2 నుంచి 3 లక్షల వరకూ అవుతాయి.మల్లి ఎలక్షన్ లోగా మన నియోజక వర్గానికి వస్తాడో రాడో, రెండు నుంచి మూడు బహిరంగ సభలు పెట్టుకోవాలి.మూడు బహిరంగ సభలకు కనీసం జన సమీకరణ, పై ఖర్చులు అన్ని కలిపి 35 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు కాక తప్పదు. ఇక మధ్య మధ్యలో సామాజికవర్గాల సంఘాలు ఇలా ఎన్నో సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఇవన్ని కలిపి షుమారు అరవై లక్ష అవుతుంది. బాగా తక్కువ లో చుస్తే. నా దగ్గర 50 పైన నడిచాడు. ఆ లెక్కన చుస్తే ఆయన వెంట ఉండే జనం ఖర్చు కాకుండానే కిలో మీటర్ కి లక్ష రూపాయిలు లెక్క ఉంటుంది. ఇంతా ఖర్చు పెట్టాక బాగా చేసావ్ అనే మాట అనలేదు అనుకో అన్న, పెట్టినవి అంతా వేస్ట్ అనే. ఇంకా నేను ఎమ్మెల్యే. ఇక మీ జిల్లా దాటాక ఎక్కువ తెలుగు దేశం ఉంది, అక్కడ వాళ్ళకి జనాలని పోగేసి చెయ్యటానికి ఒక 75లక్షలు తక్కువలో తక్కువ అవుద్దేమో అన్నాడట. దీనితో ఆ ప్రకాశం నేత… మొత్తానికి ఒక 60లక్షలు చూడాలి అంటావు,సరే అన్నా అని ఫోన్ పెట్టేసాడట. అది సారూ జగన్ గా రిచ్ పాద యాత్ర ఖర్చు లెక్కలు.

Advertisements

Leave a Reply