జగన్ కృష్ణా జిల్లా పాదయాత్ర జనం వెనుక కొన్ని “అసలు నిజాలు” ఆ YCP లీడర్ ఏమన్నాడు?

Advertisements

మంగళగిరి లో వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్పితే ఎవరు లేరు. జగన్ కి కోపం వచ్చింది. శుక్రవారం కోర్ట్ వాయిదాకి గురువారం ఉదయమే బయల్దేరి వెళ్ళాడు. రెండు రోజులు టైమ్ ఇస్తున్నా, బెజావాడ లో జనం కనపడాలి అని హుకుం జారీర్ చేసాడు, సస్పెండ్ అయిన గౌతమ్ రెడ్డి ని మళ్ళి పిలిచాడు, నీ సత్తా చూపెట్టు అన్నాడు, నాన లోకల్ అయిన గౌతమ్ రెడ్డి గట్టిగానే పోగేసాడు. రాధా ని నీకంటే ఎవరు ఎక్కువ కాదన్నాడు, చిట్టి నగర్ సభలో పక్కన నుంచో పెట్టుకున్నాడు,

ఈ దెబ్బ కి తూర్పు టికెట్ కోసం అయిన రాధా లెక్క చూపెట్టాడు. యలమంచిలి రవి ని నీ సత్తా ఏంటి అన్నాడు, ఆయన గట్టిగా పోగేసాడు. సో జనం కనపడ్డారు. అంత వరకు ఒక కమ్మ,రెడ్డి, కాపు నాయకులకి పని అప్ప చెప్పాడు. మల్లాది విష్ణు, వెల్లంపల్లి కూడా దండిగా కూర్చారు. మంగళగిరి ఫ్లాప్ ని విజయవాడ ఎంట్రి తో కవర్ చేసారు. కాని అసలు కిటుకు అక్కడే ఉంది.అసలు వైసీపీకి ఈ పాద‌యాత్ర ల‌భిస్తున్న ఊపు నిర్మాణ‌ప‌రంగా ఉన్న లోపాల‌ను ఏమేర‌కు అధిగ‌మించ‌గ‌ల‌న్న‌ది పెద్ద స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా విజ‌య‌వాడ లాంటి కీల‌క ప్రాంతంలో సామాజిక స‌మ‌తూకం అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ తీసుకున్న నిర్ణ‌యాల‌కు తోడు తాజాగా గౌత‌మ్ రెడ్డి మీద సస్ఫెన్ష‌న్ ఎత్తివేసిన త‌ర్వాత ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇప్ప‌టికే న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌ల‌మైన నేత‌లు క్యూలో ఉన్నారు. వెస్ట్ వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కి, సెంట్ర‌ల్ మ‌ల్లాది విష్ణుకి దాదాపు ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈస్ట్ విష‌యంలో వంగ‌వీటి రాధాకృష్ణ‌కు లైన్ క్లియ‌ర్ అని భావిస్తే తాజాగా అక్క‌డికి పోటీగా యల‌మంచిలి ర‌వి రెడీ అయ్యారు. దాంతో ఎవ‌రో ఒక‌రికి మొండిచేయి ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. ఇప్ప‌టికే ఒక వైశ్య‌, ఒక బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గాల‌కు

రెండు సీట్లు కేటాయిస్తే కాపు, క‌మ్మ వ‌ర్గాల‌లో ఒక‌రికి ఈస్ట్ సీటు క‌న్ఫ‌ర్మ్ చేయాల్సి ఉంటుంది. కాపుల నుంచి వంగ‌వీటి ధీమాగా ఉండ‌గా, క‌మ్మ నుంచి య‌ల‌మంచిలి ర‌వి రంగంలో దిగ‌డం పోటీ తీవ్ర‌త‌ను పెంచేసింది. వారిద్ద‌రికీ తోడుగా ఇప్పుడు రెడ్డి సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన గౌత‌మ్ రెడ్డి కూడా ఆశావాహుల జాబితాలో ఉంటార‌న‌డంలో సందేహం లేదు. వాస్త‌వానికి వైసీపీలో కాపు, రెడ్డి సామాజిక‌వ‌ర్గాలనేత‌ల‌కు లోటు లేదు. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో కాపులు, రాయ‌ల‌సీమ అంత‌టా రెడ్లు వైసీపీ ముఖ్య నేత‌లుగా ఉన్నారు. అలాంటి స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం నుంచి కొంద‌రు కీల‌క నేత‌ల కోసం వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. య‌ల‌మంచిలి ర‌వి రాక అందులో భాగ‌మే. ఇప్పుడు అలా వ‌చ్చిన నాయ‌కుడికి టికెట్ ఇవ్వాల‌నుకుంటే వంగ‌వీటికి నిరాశ‌త‌ప్ప‌దు. అయితే య‌ల‌మంచిలి ర‌వికి పెన‌మ‌లూరు గానీ మ‌రో చోట గానీ భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంద‌ని ఆశిస్తున్న నేప‌థ్యంలో అదే జ‌రిగితే పెద్ద స‌మ‌స్య ఉండ‌దు గానీ భిన్నంగా సిటీలోనే అయితే మాత్రం స‌మ‌స్య త‌ప్ప‌దు. ఇక గౌత‌మ్ రెడ్డిని సంతృప్తి ప‌ర‌చ‌డం మరొక ముఖ్య సమస్య. ఇలాంటి ప‌రిణామాల్లో వైసీపీ బెజవాడ రాజ‌కీయాలు చ‌ర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే రాదా ఇప్పటికే పార్టి మారటం ఖాయం అని వార్తలు వస్తున్నాయి, వాటిల్లో నిజమెంతో కాలం సమాధానం చెప్తుంది. ఒక రకం గా రాదా వెళ్ళటమే జగన్ కి కుడా కావాలేమో. ఇవన్ని ఎవరో చెప్పటం కాదు కృష్ణా కి చెందినా వైకాపా నేత అన్నారు.

Advertisements

Leave a Reply