BREAKING : బిజెపిని కలుపుకుని వెళ్ళండి వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులకు ఆదేశాలు?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అన్యాయం చేసింది అంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. తన కేసుల కేంద్రం వద్ద మోకరిల్లి.. రాష్ట్రానికి వచ్చే నిధులను ఇక్కడి బిజెపి నేతలతో తప్పుడు నివేదికలు పంపించి అడ్డుకున్న ఘనత జగన్ ది. అతని సారధ్యంలోని యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీది. దీనిని నమ్ముకునే బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాష్ట్రానికి ఇచ్చే నిధుల విషయంలో జాప్యం చేస్తూ.. చివరికి తెలుగుదేశ౦ పార్టీని తన మంత్రి వర్గం నుంచి బయటకు వెళ్ళేలా చేసుకుంది. అంతే కాకుండా జగన్ అవిశ్వాసం పెడతాను అంటే, విజయ సాయి రెడ్డి మాకు విశ్వాసం ఉంది అంటారు. ఇక్కడ వైకాపా ద్వంద వైఖరి అవలంబిస్తుంది. వైకాపా నీచపు వైఖరితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిజెపిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం సహాయం

చెయ్యలేదనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. దీనితో కేంద్ర మంత్రి వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్తే పార్టీకి రాజకీయంగా ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి. కాని వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఎంత మంచి అభిప్రాయం వచ్చే అవకాశం ఉందో అంతే నష్టం కూడా ఉంది. ఇక బిజెపి గాని తెలుగుదేశం పార్టీ గాని పొత్తు ఆలోచన చెయ్యడం లేదు. కాని రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రాన్ని నమ్మించినవిధంగా ముందుకి వెళ్ళాలి అంటే మాత్ర౦ బిజెపిపై ప్రజల్లో సానుకూల వైఖరి రావాలి. ఇలా జరగాలి అంటే కేంద్రం చేసిన సాయం ప్రజల్లోకి వెళ్లి వివరించాలి. కాని బిజెపి చెప్పే మాటలు వినే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. కాని ప్రజలు నమ్మి అందుకు సహకరిస్తేనే వైకాపాతో పొత్తు పెట్టుకోవడం సాధ్యమవుతుంది. ఇది జరగాలి అంటే దీనికి కచ్చితంగా విపక్షం బిజెపికీ సహకరించాలి. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న జగన్ ఇదే విషయమై పార్టీ నేతలకు పైన పేర్కొన్న విధంగా సందేశం పంపించారు.త్వరలో బిజెపి నేతలు ప్రజల్లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో వైకాపా కార్యకర్తలు కొందరు బిజెపి తరుపున ప్రజల్లో తిరిగి కేంద్రం చేసిన సాయాన్ని వివరించాలని.. అలా చేస్తే తెలుగుదేశం పార్టీ మీద అభిప్రాయం మారడమే కాకుండా బిజెపిపై సానుకూల వైఖరి వచ్చే అవకాశం ఉందని వారి అభిప్రాయంగా తెలుస్తుంది. ఇప్పటికే దిగజారుడు రాజకీయం చేస్తున్న జగన్ ఈ విధంగా మరోసారి తన వైఖరి బయటపెట్టారు. తాజాగా బిజెపి నేతలు విపక్ష నేతను కొనియాడటం కూడా ఇందుకే అని తెలుస్తుంది.’మనం రేపు బిజెపితో పొత్తు పెట్టుకుంటాం. మనకు రేపు అన్ని విధాలుగా సహకరించేది బిజెపి. మన పార్టీ బలోపేతం కావడమే కాకుండా వారు కూడా బలపడేలా చూడాలి. ఇది జరిగితేనే మనకు రాజకీయ భవిష్యత్తు. కాబట్టి వారికి కూడా జనాన్ని కూడగట్టండి’ ఇది వైకాపా అధిష్టానం నుంచి ఆ పార్టీ కార్యకర్తలకు వచ్చిన అంతర్గత ఆదేశం లాంటి విన్నపం. కాని కార్యకర్తలు మాత్రం దీనిని ఒకింత అవమానంగా భావిస్తూ ఎలా సహకరించాలి.. అధినేత కేసుల కోసం మనం కాళ్ళు పట్టుకోవాలా..? అనే ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here