జగన్ టైమ్ మారింది, రాయలసీమలో మరొక ముఖ్య కుటుంబం తిరిగి వైకాపా లోకి

Advertisements

రాజకీయాలలో అత్యంత సీనియర్ నేత అయినా గత కొద్ది కాలం గా నిలకడ లేకుండా ఉన్న నేత మైసూరా రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నారు అంటే సరిగ్గా చెప్పలేము. ఒకానొక టైం లో రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం రాసిన ఆయన, తర్వాత అదే వై ఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి తో చేరారు. తర్వాత కొన్నాళ్ళకు మైసూరారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. పోతూ.. పోతూ పార్టీ, అధినేతపై సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు..

జగన్ ది నిలకడ లేని మనస్తత్వం. ఇతరులు ఇచ్చిన సలహాలు జగన్ అస్సలు తీసుకోరు. మానవత్వంతో పార్టీలో చేరా.. కానీ ఆ పార్టీలో మానవీయ కోణం లేదు.. అందుకే రాజీనామా చేయాల్సి వచ్చింది అని అప్పట్లో మైసూరా సంచలన ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్నుంచి ఆయన మీడియా ముందుకు వచ్చిన సందర్భాల్లేవ్. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా మైసురా పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌ రెడ్డి, జగన్ పాదయాత్రలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు అధినేత జగన్ ఆధ్వర్యంలో ఆయన వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఆయనతో పలువురు ముఖ్య నేతలు, వంద కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్‌ రెడ్డి మైసూరా కుమారుడితో జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. దీంతో మైసురా కుటుంబం మళ్లీ వైసీపీలోకే వచ్చేసింది.ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ అద్భుత నాయకుడు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. చంద్రబాబు పరిపాలనపై ప్రజలు విసుగెత్తి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదు అని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ఒకప్పుడు జగన్‌పై.. మైసూరా సంచలన ఆరోపణలు చేసి మరీ పార్టీలోనుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే మైసురా కుమారుడు మాత్రం జగన్‌ను ఆకాశానికెత్తుతున్నారు.. ఈయన ఎన్ని రోజులు పార్టీలో ఉంటారా.. ఎంత మేరకు క్రమశిక్షణతో ఉంటారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి. మైసురా కుమారుడు పార్టీలోకి వచ్చారు సరే.. మరి మైసురా సంగతేంటి?. ఆయన దగ్గరుండి మరీ పార్టీలోకి వెళ్లమని సలహాలు ఇచ్చారా లేదా తండ్రి.. తండ్రే..

కొడుకు బాట కొడుకుదేనా? అన్నది మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. అయితే మైసూరా కూడా త్వరలో వైసీపీలోకి వస్తారా లేకుంటే వయసు అయిపోయిందిగా అనుకుని కుమారుడ్ని బలోపేతం చేస్తారో చూడాల్సిందే మరి.అయితే మైసూరా ప్రమేయం లేకుండా పార్టీ లోకి వచ్చే అవకాశమే లేదు అని, ఒక రకం గా జగన్ టైం మారింది అనటానికి ఇదే సంకేతం అని వైకాపా అభిమానులు సంబరం గా ఉన్నారు. కాకపోతే మైసూరా కుటుంబానికి అంత సీన్ లేదు అని, అందుకే తెలుగు దేశం కుడా పక్కన పెట్టిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisements

Leave a Reply