ఒక పక్క జగన్ పాద యాత్ర చేస్తున్నాడు, మరొక పక్క పార్టీని వీడే వాళ్ళు వీడుతున్నారు, పార్టీలోకి వచ్చే వారు వస్తున్నారు. ఎన్నికల సీజన్ లో వైకాపా తెదేపాలదే హవా కనపడుతుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి కి చాలా ప్రాంతాల్లో పోటికి అభ్యర్థులు కావాలి. వచ్చే ఎన్నికల్లో కొత్త నేతలు అత్యవసరం. అందుకు తగ్గట్టుగా వేట ప్రారంభించింది వైకాపా. గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో కొందరు మల్లి పోటి చెయ్యం అని తెగేసి చెప్తుంటే, మరి కొందర్ని జగన్ మార్చేయ్యలని చూస్తున్నాడు. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు చాలా మంది ఎంపి కి పోటి చెయ్యలేము, ఎమ్మెల్యే కి చెయ్యగలము అని చెప్తుంది. అలానే వైసీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గడిచిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కృష్ణా
వరకూ 6 జిల్లాల పరిధిలో కేవలం ఒకే ఒక్క అరకు ఎంపీ సీటుని వైసీపీ గెలుచుకోగలిగింది. ఆ తర్వాత గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత సహా పలువురు నేతలు పార్టీ నుంచి ఫిరాయించేశారు. 2014లో పోటీ చేసిన అభ్యర్థుల్లో విజయనగరం అభ్యర్థి బేబీనాయన, రాజమహేంద్రవరం అభ్యర్థి బొడ్డు వెంకటరమణ, విజయవాడ అభ్యర్థి కొనేరు వైసీపీని వీడిపోయారు. ఇక ఏలూరు నుంచి బరిలో దిగిన తోట చంద్రశేఖర్, కాకినాడ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్ కూడా పోటి చెయ్యలేము అని చెప్పెసారట. విశాఖ నుంచి పోటీ చేసిన విజయమ్మ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు చాలా స్వల్పం. అంతేగాకుండా శ్రీకాకుళం అభ్యర్థి రెడ్డి శాంతి, నర్సాపురం నుంచి పోటీ చేసిన వంక రవీంద్రనాధ్ కూడా పోటి కి సుముఖం గా లేరట. వారికి తోడుగా అమలాపురం అభ్యర్థిగా పోటీ చేసిన పినిపే విశ్వరూప్ వచ్చే ఎన్నికల్లో ఎంపి కి చెయ్యలేను అనిమ అసెంబ్లీ కి సీటు ఖాయం చేసుకున్నారు. అనకాపల్లి నుంచి బరిలో దిగిన గుడివాడ అమర్ నాధ్ కూడా దాదాపుగా ఎమ్మెల్యే సీటు ఖాయం అంటున్నారు. మచిలీపట్నం నుంచి పోటీ చేసిన పార్థసారధి కూడా ఈసారి అసెంబ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరందరూ ఎంపి పోటి కి విముఖం గా ఉన్నారు. దాంతో వైసీపీ తరుపున వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల కోసం భారీ వేట మొదలు పెట్టారు.. అందుకు తగ్గట్టుగా కీలక నేతల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా
విజయనగరం నుంచి బొత్సా ఝాన్సీ రంగంలో దిగడం దాదాపు ఖాయం. ఇక కాకినాడ నుంచి కురసాల కన్నబాబుని పోటీ చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక అనకాపల్లి స్థానం కోసం ఒక నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొణతాల రామకృష్ణ రంగంలో దిగినా ఆశ్చర్యం లేదు.ఏలూరు స్థానాన్ని మరో మాజీ ఐఏఎస్ అధికారి ఆశిస్తుండగా, కమ్మ సామాజికవర్గానికే కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజమహేంద్రవరం స్థానాన్ని సినీ ప్రముఖుడికి కేటాయించే అవకాశం ఉంది. ఓ స్టార్ దర్శకుడు, మరో సీనియర్ ప్రముఖుడు(మాజీ ఎంపి) ఆశిస్తున్నారు. గతంలో వైసీపీని వీడి వెళ్లిన నాయకుడికి ఈసారి నర్సాపురం సీటు క్షత్రియ కోటాలో కేటాయించబోతున్నట్టు ప్రచారం మొదలయ్యింది. విజయవాడ నుంచి ప్రముఖ నిర్మాత ని రంగం లోకి దింపాలని జగన్ భావనగా ఉందట. మచిలీపట్నం సీటు విషయంలో స్పష్టత లేదు, ఇంకా అభ్యర్ధి దొరకలేదు. వైజాగ్ ఎవరికీ అనేది స్పషత లేదు.. అయితే అరకు విషయంలో మాత్రం వైసీపీ తరుపున ఎవరు అనేది స్పష్టత లేదు. శ్రీకాకుళం రెడ్డి శాంతిని కాదనుకుంటే కిల్లి కృపారాణికి కండువా కప్పేయడం ఖాయం. అమలాపురం సీటులో హర్షకుమార్ కన్నా కొత్త అభ్యర్థి మేలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఆరు జిల్లాల పరిధిలో వైసీపీ ఎంపీ క్యాండిడేట్స్ అంతా
దాదాపుగా కొత్తవారే ఉంటారని మాత్రం చెప్పవచ్చు. పాదయాత్ర పూర్తయ్యే లోపు తొలి విడుత అభ్యర్ధుల కోసం ఒక రౌండ్ కసరత్తు పూర్తీ చేసే ఆలోచనలో ఉన్నాడు జగన్. కాని ఒకటి రెండు స్థానాల్లో తప్పితే మిగతా స్థానాల్లో అభ్యర్ధులు పోటి కి విముఖం గా ఉండటమో, లేదా అభ్యర్ధులు లేకపోవటమో అన్నట్టు ఉంది. కన్ఫర్మ్ అయిన స్థానాల్లో కూడా ఎవరు ఇంకా పని మొదలు పెట్టలేదు. ఇదంతా చూస్తుంటే 2014లో గెలిచిన ఆ ఒక్క అరకు స్థానం కూడా గెలిచే అవకాశం లేదు.