MUST READ: జగన్ కి వైఎస్సార్ పేరు ఎత్తే అర్హత కూడా లేదు : PERFECT ANALYSIS

వైకాపా ఎమ్మెల్యేలు ప్రస్తుతం కడుపు మండిపోయి ఉన్నారు. తెలుగు దేశం లోకి ఎంట్రీ దొరకని, వైఎస్సార్వ అంటే విపరీతం అయిన ప్రేమ ఉండి, జగన్ ని వదలలేని వారు మాత్రమె వైకాపాలో  ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే అలాంటి సీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కి వైఎస్సార్ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే వైఎస్సార్ తప్పితే రాజకీయ నాయకుడు లేడు, లీడర్ లేడు అనే అంత. అలాంటి నాయకుడు ఈ రోజు వైకాపా ఆవిర్భావం సందర్భం గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు అయితే యయి ఉండొచ్చు…ఆయాన కొడుకు అయితే అయ్యి ఉండొచ్చు కాని ఆయన పేరు ఎత్తే అర్హత లేదు అన్నాడట. ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఆ నేత అలా నిప్పులు చెరిగే అప్పటికి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదట ఇతర నాయకులకి.

రాజశేఖర్ రెడ్డి రాజకీయం, జగన్ రాజకీయం కి నక్కకి నాగ లోకానికి ఉన్న తేడా ఉంది. రాజశేఖర్ రెడ్డి మొండి వాడు, ఎక్కడ తగ్గాలో  తెలిసిన వాడు. పాద యాత్ర లో ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యాక అనలేదు, కాంగ్రెస్ అధికారం లోకి వస్తే అనే వాడు. ఆయన పాద యాత్ర లో చంద్రబాబు మీద సునిశిత విమర్శలు ఉండేవి. తీవ్ర వ్యాఖ్యలు ఉండేవి కాదు. ఆయన పాద యాత్ర నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనతో పాటు చాలా మంది నేతలు సిఎం అభ్యర్ధి గా ఉన్నారు. కాని ఆయన ఎప్పుడు నా కోసం అన్నట్టు చెయ్యలేదు, రాష్ట్రం కోసం, ప్రజల కోసం అన్నట్టు చేసాడు. ఈ పిల్లగాడు ఎంత సేపు నేను ముఖ్య మంత్రి అయ్యాక అంటూ ఉంటె పదవి కోసమే అన్నట్టు జనం కి అర్ధం అవుతుంది.అది రాజకీయం లో నష్టం. చెప్పబోతే గడుముతాడు, వైఎస్సార్ అప్పట్లో ఎవరు వెళ్ళిన లేచి నుంచునే వారు, ఆయనకు అహం ఉండేది కాదు. నలుగురిని కలుపుకుని వెళ్ళేవాడు, మీరేం అంటారు అని అభిప్రాయలు వెతికే వాడు, ఇక్కడ కథ వేరు…నేను చెప్పాను అదే ఫిక్స్ అంటాడు, ఏమి తెలుసు ఈ పిల్లగాడికి. తెలుగు దేశం మీద వ్యతిరేకత ఉంటె చాలదు గా, పోయి నీ తప్పు ఇది అని చెప్పాలి అసెంబ్లీ కి పోదాం అంటే లేదు నేను వెళ్ళాను అంటాడు….ఏమి పద్దతి, అలిగి బయట కూర్చోటానికా

నన్ను గెలిపించింది అనుకోవాలి గా? ఆయన కి పులివెందుల సేఫ్ సీట్…మనకి అలా కాదు గా…చంద్రబాబు మన కుర్చీ కింద కి నీళ్ళు పంపాడు, పంటలు పండుతున్నాయి….జనం మారతన్నారు. అసలు పార్టీ పెట్టినపుడు ఉన్న వారు ఒక్కరన్నా ఉన్నారా ఇవ్వాళ జగన్ తోని.రాజశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న ఆ కొందరిని జగన్ దగ్గరకు చేర్చుకుని వారి సలహాతో రాజకీయం చెయ్యాలని ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలో వారికి తెలుసనీ ఇవేమీ లేకుండా సొంతగా ముందుకి వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం మినహా మరొకటి లేదని గమనించాలి గా.అలాగే రాజశేఖర్ రెడ్డి పాలన జగన్ అందిస్తారు అనే నమ్మకం ఆయన తీరుతో ప్రజల్లో పోయింది. నేను ఇన్నాళ్ళ నుంచి ఉన్నా, చంద్రబాబు ని చుసా, రాజశేఖర్ రెడ్డి ని చూసా….ఈ పిల్లగాడిలో ఎదిగే లక్షణమా లేదు. తెలిసిన వాళ్ళని అడగాలి, లేకపోతే చెప్పినపుడు వినాలి, ఏమి లేకుండా నాకు తెలుసు అనుకుంటే నువ్వొక్కడివే గెలుస్తావ్ అని ఎవరు చెప్పాలి?  ఇక ముందు ఇక రాజన్న పాలన , రాజన్న రాజ్యం లాంటి మాటలు మాట్లాడే అర్హత కూడా లేదు జగన్ కి. ఆయన రాజకీయం లెక్క వేరే, మనం అందరం కలిస్తేనే నేను అనే వాడు, ఈ పిల్లగాడు నేను ఉంటేనే మీ అందరు అంటాడు. ఎదురుగా చంద్రబాబు లెక్క గట్టిగా వేస్తాడు, మనోడికి ఏమి తెలీదు, అంత నేనే… నేనే ముఖ్యమంత్రి తప్పితే. అందుకే అనేది ఆయన పేరు కాదు కదా, బొమ్మ కూడా తీసేయ్యాలి ఈ పార్టి లో, ఇది జగన్ కాంగ్రెస్. ఈ మాటలు అతని ముందే చెప్పగలను. సస్పెండ్ చేస్తారేమో అన్నాడు, చేస్తే చెయ్యని. ఇలాంటి పార్టి లో ఉండేబదులు ఇంట్లో కూర్చుంటా. అధికారం వచ్చే అవకాశమే లేదు, ఇక ఇలా చేస్తూ పోతే పార్టీ నే ఉండదు అన్నాడట సదరు “ముఖ్య ఎమ్మెల్యే”.

ఆయన పేరు అర్ధం అయ్యిందా? ఆర్టికిల్ లోనే హింట్స్ ఉన్నాయ్…చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here