ఇంటెలిజెంట్ బుల్లెట్ రివ్యూ

Advertisements

2014లో పరిచయం అయినా ఇప్పటి వరకు ఒక్క మూడు సినిమాలు పిల్ల నువ్వు లేని జీవితం,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,సుప్రీం కాస్త పర్వాలేదు అనిపించాయి. మిగతా 5 సినిమాలు రేయ్,తిక్క,విన్నర్,నక్షత్రం,జవాన్ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్స్ అయ్యాయి. అందులో రేయ్ తప్పితే మిగతా నాలుగు వరుసగా వచ్చాయ్. ఈ మధ్యలో తన కెపాసిటి తగిన సినిమా తియ్యలేని వినాయక్, గత సంవత్సరం లో డైరెక్ట్ చేసిన రీమేక్ హిట్ ఖైది నంబర్ 150 తర్వాత చేస్తున్న చిత్రం ఇంటెలిజెంట్. సాయి ధరం తేజ్ లో టాప్ బిజినెస్ చేసిన ఈ చిత్రం మీద ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎలా ఉంది అనేది మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం..

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

సాయి ధరం తేజ్ ఎప్పటి లానే తన పాత్ర కి న్యాయం చెయ్యటానికి ప్రయత్నించాడు

లావణ్య త్రిపాటి అందంగా ఉంది, కాని పెర్ఫర్మాన్స్ కి పెద్ద స్కోప్ లేదు

సాంగ్స్ పర్లేదు, అంతకు మించి మ్యూజిక్ గురించి చెప్పుకోటానికి ఏమి లేదు

సప్తగిరి కామెడి కి ఒక చోట నవ్వుతాము,సినిమా మొత్తం లో ఎమన్నా బావుంది అంటే ఆ సీన్ ఒక్కటే

కథ, కథనం,దర్సకత్వం ఒక్కటి కుడా బాలేదు

వినాయక్ కెరీర్ లో అఖిల్ ఇప్పటి వరకు భరించలేని సినిమా

కాని ఈ సినిమా దాని కంటే దారుణం గా ఉంది..కూర్చోటం చాలా కష్టం

అసలు ఆది తీసిన వినాయక్ తీసాడా ఈ సినిమా అనిపించే అంత దారుణం గా ఉంది

సినిమా స్టార్ట్ అయిన నలభై నిమిషాల నుంచి థియేటర్ లో వాక్ అవుట్ చేస్తున్నారు

ఎడిటింగ్, చాయాగ్రహణం,సంగీతం ఒక్కటేంటి ఒక దానిని మించి ఒకటి ఫెయిల్ అయితే వినాయక్ వాటిని మించి ఫెయిల్ అయ్యారు

ఓవరాల్ గా మీకు V V వినాయక్ మీద ఏమన్నా గౌరవం ఇష్టం ఉంది ఉంటె,అసలు ఈ సినిమా ని ఫిల్మోగ్రఫీ నుంచి తీసెయ్యండి. ఈ సినిమా ఆయాన్ తియ్యలేదు అనుకోండి. టైటిల్ లో ఉన్న ఇంటెలిజెంట్ సినిమా లో లేడు. సినిమాలో ఇంటలిజెన్స్ అనేదే లేదు. ఈ సినిమా చివరి దాకా కూర్చున్న వారికి బద్దం భాస్కర్ అవార్డ్ ఇవ్వొచ్చు. ఇంకో హిట్ కోసం తేజ్ నిరీక్షణ కంటిన్యు అవుతుంది.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ 1.5/5

Advertisements

Leave a Reply