ఇది నా లవ్ స్టోరి బుల్లెట్ రివ్యూ

లవర్ బాయ్ తరుణ్ చాలా గాప్ తర్వాత వెండి తెర మీద కనిపించిన చిత్రం ఇది నా లవ్ స్టోరి. రమేష్ గోపి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా సార్లు వాయిదా పడి ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు రాష్ట్ర వ్యాప్తం గా టూర్ చేసి మరి తరుణ్ ప్రమోట్ చేసారు. ఈ చిత్రంలో తమిళ్ బిగ్ బాస్ షో బ్యూటి ఓవియా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఎలా ఉందొ మా బుల్లెట్ రివ్యూలో చూద్దాం.

తరుణ్ ఎప్పటిలానే బాగా చేసాడు,మంచి అండర్ ప్లే ఉన్న కారక్టర్ లో ఒదిగిపోయాడు. స్క్రీన్ మీద కూడా చాలా అందం గా ఉన్నాడు. ఇప్పటికి అయినా మంచి కథ పడితే హిట్ కొడతాను అనే అంత నమ్మకం గా ఉంది అతని నటన.

ఓవియా నటనలో పెద్దగా చెప్పుకోటానికి ఏమి లేదు కాని, రొమాంటిక్ సన్నివేశాల్లో బావుంది.

శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. నేపధ్య సంగీతం గురించి డిస్కషన్ కూడా అక్కర్లేదు.

ఎడిటింగ్ చాలా పేలవం గా ఉంది, ఫస్ట్ కట్ అయ్యాక బాగా ముఖ్యమైన ట్రిమ్మింగ్ చేసారా అనే సందేహం వస్తుంది.

నిర్మాణ విలువలు బావున్నాయి, సరిపడా ఖర్చు పెట్టారు.

సినిమాటోగ్రఫీ కాస్త పర్వాలేదు, అరకు అందాలని బాగా తెరకెక్కించారు.

డైలాగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పనికిరాని ప్రాసలతో, అనవసరం అయిన శ్లేషలతో చిత్ర వధ కు గురి చేసారు.

ఈ సినిమా వరకు దర్శకుడు రమేష్ గోపి దే పూర్తి తప్పు అని చెప్పుకోవాలి. పాత చింతకాయ పచ్చడి లాంటి కథని తన స్క్రీన్ ప్లే మాయ జాలం తో ప్రజంట్ చేద్దాం అనుకున్నాడో ఏమో తెలీదు కాని, చాలా కంగాళీ గా చేసాడు. క్లిమాక్స్ లో వచ్చే ట్విస్ట్, ఓహ్ అవునా అనిపిస్తుంది. అది తప్పితే ఇంకేం లేదు ఈ సినిమాలో.

ఓవరాల్ గా చూస్తె ఆన్లైన్ లో వచ్చినా ఎవాయిడ్ చెయ్యొచ్చు. ఏ దశలోనూ ఈ చిత్రం బావుంది అనుకునే అవకాశం లేదు. ఈ సినిమాలో లవ్వు లేదు, స్టోరి లేదు. రెండు రోజుల్లో ఇది నా లవ్ స్టొరీ దియేటర్లలో ఉండదు.

ఆంధ్రుడు.కామ్ రేటింగ్ : 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here