సాయి పల్లవి ఐతే నేను చెయ్యను తప్పుకున్న మరో తెలుగు హీరో, కారణం తెలుసా?

మళయాళ క్లాసిక్ తో డెబ్యూ చేసి సౌత్ ఇండియా లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకటైన ఆమె ని ఇప్పుడు వరుస వివాదాలు చుట్టూ ముడుతున్నాయి. ఫిదా లో శేఖర్ కమ్ములతో, వరుణ్ తేజ్ తో గొడవ పడ్డ సాయి, MCA తో నాని కి నరకం చూపించిన విషయం తెలిసిందే. ఇద్దరికీ మధ్యలో చాలా వివాదాలు జరిగాయని తెల్సిందే. అయితే నాని మాకేమీ లేదు అని చెప్పి ఆ వివాదాన్ని అంతటితో ముగించాడు. మొత్తం మూడు సినిమాల ఎగ్రీమేంట్ చేయించుకున్న దిల్ రాజు, రెండు సినిమాలకే చాలు అనెసాడని టాక్. ఇవన్ని పక్కన పెడితే తమిళ్ స్కెచ్ మూవీ లో సాయి పల్లవి ని భరించలేక ఆమె తో షూట్ చేసాక మార్చి తమన్నా ని పెట్టుకున్నాం అని విక్రం అనేసాడు. సెల్వరాఘవన్ సూర్య మూవీ లో సై వాళ్ళ ఇబ్బందులు పడుతున్నాం అని సూర్య కి చెప్పెసారట యూనిట్ సభ్యులు. ఇవన్ని కాక నాగ శౌర్య కణం అనే సినిమా లో సాయి తో చేసి, ఆమెకి ఒక దణ్ణం అంట పొగరు, బాడ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని చూడలేదు అని ప్రెస్ కే చెప్పేసాడు. ఇప్పుడు ఈ లిస్టు లో మరొక హీరో చేరాడు.

లాస్ట్ ఇయర్ మంచి హిట్టు అందుకున్న ఆ టాప్ స్టార్ కొత్త చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది.ఆ చిత్రం లో సాయి పల్లవి నే మెయిన్ హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు. అలా అని మీడియా లో వార్తలు కుడా వచ్చాయి. ఇద్దరి జోడి బావుంటుంది అనుకున్నారు. దర్శకుడు కూడా ఆమెని దృష్టి లో పెట్టుకునే సీన్స్ రాసుకున్నాడు. ఇంకొక పది పదిహేను రోజుల్లో షూటింగ్ కి వెళ్ళాలి అనగా…..సాయి పల్లవి ని మార్చండి అని కోరారట హీరో, కాని దర్శకుడు,నిర్మాత షూటింగ్ అన్ని ఏర్పాట్లు చేసాము, అందరి డేట్స్ మళ్ళీ దొరకాలి అంటే కష్టం అన్నారట. అందరి డేట్స్ అలానే ఉంచుకోండి, వేరే హీరో డేట్స్ తెచ్చుకోండి అన్నాడట. దానితో ఖంగుతిన్న దర్శక నిర్మాతలు కారణం చెప్పమని గుచ్చి గుచ్చి అడిగినా ఆపలేదట. ఆ నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా హీరో,సాయి పేరు మీద ఫైనాన్స్ తెచ్చుకుని ఏర్పాట్లు చేసారని సమాచారం.కాని ఈ సడెన్ ట్విస్ట్ కి దిమ్మ తిరిగిన నిర్మాత ఆలోచనలో పడ్డాడట. సాయి పల్లవి ని తెలుగు లో అద్భుతం గా ఆదరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేమం సహా తెలుగు లో చేసిన రెండు సినిమాలు కూడా తన వల్ల హిట్టు అయ్యాయి అని చాలా గర్వం గా ఉంటుందని టాక్. నాగ సౌర్య కూడా అదే చెప్పాడు. ఏది ఏమైనా ఇంకా చాలా సినిమాలు చెయ్యాల్సిన సాయి పల్లవి ఇలా వరుసగా అవకాశాలు కోల్పోవటానికి కారణం కేవలం ఆమె యాటిట్యూడ్ ఆ కాదా అనేది ఎవరికీ తెలీదు….కాని తెలుగు లో ఉన్న నటన చెయ్యగలిగే హీరోయిన్స్ లో తొలి వరసలో ఉంటుంది సాయి పల్లవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here