కన్నా అంతమే నా పంతం, కన్నాని ఓడించటం ఖాయం, టిడిపి ఎంపి సవాల్

తనకు వయస్సు పైబడిందని,ఆరోగ్యం కూడా సహకరించడం లేదని, రాజకీయాల్లో ప్రజలకు సేవచేసీ చేసీ పోటీ చేయకుండా విశ్రాంతి తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించిన నర్సరావుపేట ఎంపి రాయపాటి తన నిర్ణయానికి వెనక్కు తీసుకుని మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. రాయపాటి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో బద్దవైరం ఉండేది. పరస్పరం విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు చివరకు పరువు నష్టం దావా కూడా వేసుకున్నారు. పదేళ్లపాటు గుంటూరు జిల్లాలో అధికారం చెలాయించిన కన్నా కు 2014 ఎన్నికల ఫలితాలు చెక్‌ పెట్టాయి. ఆర్థిక పరంగా, విపక్షాలు కూడా ఊహించని విధంగా ఎదిగిన కన్నా దూకుడుకు కళ్లెం పడింది. తన రాజకీయ గురువైన మాజీ కాంగ్రెస్‌నేత కావూరి సాంబశివరావు బిజెపిలో చేరడంతో ఆయన సూచనలతో బిజెపిలో చేరారు. అయినా ఎవరూ ఆయన్ని పట్టించుకోకపోవడంతో తర్వాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించారు. అక్కడ పట్టించుకోకపోవడంతో వైకాపాలో చేరేందుకు జగన్‌ ను సంప్రదించారు. అదుగో ఇదుగో వైకాపాలో


కన్నా చేరుతున్నారనే సమయంలో కేంద్ర బిజెపి పెద్దలు బ్రేక్‌ వేశారు. ఇంతలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు జరిగి కన్నాను రాష్ట్ర బిజెపి అద్యక్షుడిగా ప్రకటించారు. రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని భావించిన రాయపాటి కన్నాను దెబ్బకొట్టేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారని ఆయన అభిమానులు చెప్తున్నారు. అంతే కాకుండా కన్నా వైకాపా,జనసేన నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆయనపై తన కుమారుడిని పోటీకి దింపి ఓడించి కక్ష తీర్చుకోవాలంటే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండకతప్పదని భావించి ఆయన ప్రకటన చేశారని అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆయనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, దీని వెనుక కావూరి సాంబశివరావు ఉన్నారని చెబుతున్నారు. అటు కావూరితో ఇటు కన్నాతో రాజకీయ వైరం ఉన్న రాయపాటి మళ్లీ వారిద్దరూ రాజకీయంగా తెరపైకి రాకుండా ఉండాలంటే తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోకూడదని భావించి మళ్లీ తెరపైకి వచ్చారు. గుంటూరు నియోజకవర్గంలో రాయపాటి కుటుంబానికి అభిమానులు, టిడిపి అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో కన్నా ఇక్కడ పోటీ చేస్తే అవలీలగా ఓడించగలమనే విశ్వాసంతో రాయపాటి ఉన్నారు. మళ్లీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం కన్నానే కారణంగా చెప్పవచ్చు. అంతే కాకుండా కర్ణాటకలో తెలుగు ఓటర్లు చంద్రబాబు పిలుపుతో బిజెపి అభ్యర్థులను ఓడించడంతో మళ్లీ ఎపిలో అధికారం టిడిపికే దక్కుతుందని ఈ నేపధ్యంలో తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని ఆయన భావిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here