సినిమాల నుంచి తప్పుకుంటున్నా – నివేథా థామస్

Advertisements

2016 లో నాని సరసన జంటిల్మెన్ లో కనిపించి యువత గుండెలు కొల్లగొట్టిన అమ్మడు నివేధా థామస్. అవ్వటానికి మలయాళీ అయినా, చెన్నై లో సెటిల్ అయిన ఈ అందాల రాశి, తెలుగు లో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తమిళ్ లో విజయ్, మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చిన జిల్లాలో మెరిసిన నివేథా, 2015లో కమల్ హాసన్ కూతురు గా పాపనాశం లో కనిపించింది. ఈ రెండు చిత్రాలు మంచి పేరు తేవటంతో పాటు ఇతర బాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. నాని జంటిల్మెన్ లో కాధరీన్ గా కనిపించ నివేధా ఆ ఒక్క సినిమా తో తెలుగు లో తన ప్లేస్ సుస్థిరం చేసుకుంది.

జంటిల్మెన్ తర్వాత మరలా నాని తో కలిసి ఈ సంవత్సరం నిన్ను కోరి చిత్రం తో కనువిందు చేసింది. ఈ ఇయర్ లోనే జై లవకుశ లో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే జాక్ పాట్ కొట్టింది. ఈ సంవత్సరం ఆఖరుకి నవీన్ చంద్ర తో కలిసి జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ లో కనిపించినా అది పెద్ద గా పేరు తీసుకుని రాలేదు. వరుస హిట్లు మీద ఈ మలయాళీ భామ కి తెలుగు తమిళ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి, అయినా కొత్త సినిమాలు ఏమి ఒప్పుకోవట్లేదు అట. సాధారణం గా హీరోయిన్స్  లైఫ్ స్పాన్ చాలా తక్కువ గా ఉంటుంది. అందుకే  వచ్చిన అవకాశాలు వరుసగా ఒప్పుకుని వీలు అయినంత డబ్బు ని, వచ్చినంత పేరు ని తీసుకుని రిటైర్ అవుతారు, గత తరం సిమ్రాన్ నుంచి నిన్నటి తరం త్రిషా వరకు ఇదే జరిగింది.

డిమాండ్ లో ఉండగా సినిమాలు ఒప్పుకోకుండా, కొత్త కమిట్మెంట్స్ లేకుండా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. ఫాన్సీ ఆఫర్లు, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా ఈ అమ్మాయి సున్నితం గా వద్దు అంటుందట. సినిమాల నుంచి తప్పుకుంటున్నా అని ఖరాఖండి గా చెప్తుందట. ఇంతకీ కారణం ఏంటా అని ఆరా తీస్తే ఆర్కిటెక్చర్ లో బాచిలర్స్ చేస్తున్న ఈ అమ్మడు చదువు బాగా ముఖ్యం అని నమ్ముతుందట. అందుకే చదువు,పరీక్షలు పూర్తి అయ్యేదాక కొత్తగా ఏమి సినిమాలు ఒప్పుకోనని చెబుతుంది.ఈ విరామం తాత్కాలికమే కాని శాశ్వతం కాదని నివేధా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సడెన్ నిర్ణయంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుడుతుంది,అంతే కాక నివేథా ని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకున్న దర్శకుల పరిస్థితి ఏంటో? ఏది ఏమైనా నివేథా త్వరగా ఎక్జామ్స్ పూర్తి చేస్కుని రావాలని కోరుకుందాం.

Advertisements

Leave a Reply