BREAKING : వైకాపా అవిశ్వాసానికి చంద్రబాబు విరుగుడు మందు చరిత్రలో నిలిచిపోయే వ్యూహం అవుతుంది

ఏపి వ్యాప్తంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై వ్యతిరేకిస్తున్న ప్రత్యేక హోదా,విభజన చట్టం అమలుకు ఉభయసభల్లో టిడిపి,వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎంపీలు ఆందోళనలు చేపట్టి సభల నిర్వాహణ ప్రతిరోజు వాయిదా వేస్తున్న ఏపి వ్యతిరేక పందానుంచి కేంద్రం వెనక్కి తగ్గ డంలేదు.రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసు కొన్న పరిణామాలనుంచి బయట పడేందుకు బిజేపితో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలపి మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తూ ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆశలు పెట్టుకోగా ఈ ఆర్థిక బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపింది.చర్చల పేరిటా కేంద్రహోం,కేంద్ర ఆర్థికశాఖ, ఉపరితల రవాణా శాఖ,పరిశ్రమలు,వాణిజ్య శాఖల మంత్రులతో సంబంధిత మంత్రులతో సమావేశమైనా కేంద్రం పాతపాటే పాడుతోంది.తాము హోదాకు

మించిన సాయం,నిధులను కేం ద్రం రాష్ట్రానికి ఇచ్చిరదని ప్రకటించడం తప్ప ఎటు వంటి లెక్కలు చెప్పడం లేదు.రాష్ట్ర ప్రభు త్వం కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తోంటే ఈ నాలు గళ్ళలో కేంద్రం విడుదల చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పలేదంటూ రాష్ట్రంపై కేంద్రం బుకాయిస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం రాజకీయ దిగజారుడు తనం లో వైకాపా అధమ స్థాయి కి వెళ్ళటం అనేది ఎవరు కాదనలేనిది. వైకాపా కేంద్రానికి తొత్తులా వ్యవహరిస్తూ వారికి అనుకూలం గా వారి సూచనల మేరకు నడుచుకోవటం, మా మీద కేసులు తీసేస్తే చాలు మేము మీరేం అడిగితే అది చేస్తాం అనే వైఖరి వల్లనే కేంద్రం చెలరేగి పోతుంది ఆంద్ర కి నష్టం చేస్తుంది. ఈ నేపద్యం లో అవిశ్వాసం చర్చకు రాదు అని తెలిసి కూడా అవిశ్వాసం పెట్టటానికి వైకాపా సిద్దం అయ్యింది. అంతే కాకుండా మా అవిశ్వాసానికి తెదేపా మద్దతు ఇవ్వాలి అని సైజుకు మించి మాటలు మాట్లాడుతుంది. వైకాపా లెక్క ప్రకారం వాళ్ళు అవిశ్వాసం పెట్టగానే తెలుగు దేశం మద్దతు ఇస్తే అది వైకాపా విజయం, మద్దతు ఇవ్వకుంటే కేంద్రం తో తెదేపా కుమ్మక్కు రాజకీయం అని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళొచ్చు అని ఒక అద్భుతమైన ప్లాన్ వేసారు. దానికి చంద్రబాబు ఒక ఆమంచి విరుగుడు వేసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. వైకాపా అవిశ్వాసం పెట్టె లోపలే

కేంద్రం మీద విమర్సల వేడి పెంచి, కేంద్రాన్ని ఎండగట్టి కేంద్రం వైకాపా కుమ్మక్కు రాజకీయం ప్రజల్లోకి వెళ్ళాక MPలు రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు గా తెలుస్తుంది. అలా రాజీనామాలు చేసిన వెంటనే ఉప ఎన్నికలు వచ్చే పొజిషన్ ఉన్నా రాజీనామాలు అప్రూవ్ చెయ్యకుండా తాత్సారం చెయ్యటమే కేంద్రం దగ్గర ఉండే ఆప్షన్, ఒక వేల అప్ర్రోవ్ చేస్తే సింపతి వేవ్ తో తెలుగు దేశం ఘన విజయం సాధించటం పక్కా. తెలుగు దేశానికీ మైలేజ్ రాకూడదు అని ఫైట్ చేసే కేంద్రం రాజీనామాలు అప్రూవ్ చెయ్యటానికి అవకాశం లేదు. ఒక వేళ రాజీనామాలు ఒప్పుకుంటే, వైకాపా కూడా చేసి తీరాలి. వైకాపా కి ఎన్నికలకు సన్నద్ధం అయ్యే టైం ఉండదు. బిజెపి ఎవరితో కలిసి పోటి చెయ్యాలి? ఒక వేళ చేయాను అంటే ఇప్పటి వరకు అన్ని లక్షల కోట్లు ఇస్తే పోటి చెయ్యొచ్చు గా అనే సవాల్ వస్తుంది? సరే పోటి చేద్దాం అంటే డిపాజిట్ తెచ్చుకునే అభ్యర్ధి ఒక్కరు లేరు, రాష్ట్రానికి ఏదన్న ఇవ్వాలి,అది నోటి మాట గా చెప్తే కుదరదు, తప్పని సరిగా ప్రజలు నమ్మాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ని తప్పితే ప్రజలు ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక వేళ బిజెపి అలా ప్రకటించినా అది తెలుగు దేశం పోరాటమే అన్నది జనం లోకి వెళ్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పని చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కనుక నిజం అయితే అత్యంత కీలక వ్యూహం గా చరిత్ర లోకి వెళ్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here