కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మేజర్ హైలెట్స్ తెలుసా? ఇవిగో చూడండి

Advertisements

కర్నాటక ఎన్నికల ఫలితాలు విచిత్రంగా ఉన్నాయి. ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ కు పడినా.. సీట్లు మాత్రం బీజేపీ ఎక్కువగా గెలుచుకున్నది. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో మెజార్టీ భారీగా ఉంటే.. బీజేపీ గెలిచిన స్థానాల్లో మెజార్టీ తక్కువగా ఉంది. దీంతో ఓవరాల్ గా కాంగ్రెస్ 37.9శాతం ఓట్లు సాధించింది. గెలిచిన సీట్లు మాత్రం 78 దగ్గర ఆగిపోయింది. అదే బీజేపీ కేవలం 36.2శాతం ఓట్లు మాత్రమే సాధించి.. 104 స్థానాల్లో గెలుపొందటం విశేషం. కర్నాటక ఎన్నిక ఫలితాల్లో హైలెట్స్ ఓసారి చూద్దాం..

… కాంగ్రెస్ కు గతంలో 36.6 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 1.3 శాతం పెరిగి 37.9 శాతం ఓట్లు వచ్చాయి. అయినా 44 సీట్లు తగ్గిపోయాయి.

… బీజేపీకి గతంలో 32.2 శాతం ఓట్ల ఉంటే ఇప్పుడు 4 శాతం పెరిగి 36.2శాతం వరకు వచ్చాయి. గతంలో దూరమై ఓట్లు చీల్చిన యడ్యూరప్ప, గాలి వర్గాలు కలిసిపోవడంతో ఓటింగ్ పెరిగింది. దీంతో సీట్లు వంద దాటినా మెజార్టీ మార్క్ దక్కలేదు.


… వందకుపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ కంటే కాంగ్రెస్ కు 1.8 శాతం ఓట్లు ఎక్కువగా రావడం విశేషం. ఈ తేడా 5 లక్షల ఓట్లకు సమానం. పాత మైసూరు ప్రాంతంలో బీజేపీకి అసలు ఓటు బ్యాంకు లేకపోవడం, ఆ పార్టీకి బాగా పట్టున్న ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ నమోదు కావటం వల్ల ఇలాంటి చిత్రమైన పరిస్థితి వచ్చింది.

… జేడీఎస్ కు గతంలో 20.2 శాతం ఓట్లు రాగా ఇప్పుడు బాగా తగ్గి 18.5 శాతానికి పడిపోయింది. దీంతో గతం కంటే మూడు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. బీఎస్పీతో దోస్తీ ఉన్నా జేడీఎస్ కు ఓట్లు తగ్గిపోగా బీఎస్పీకి ఒక సీటు దక్కింది.

… సినీ నటుడు ఉపేంద్ర స్వయంగా ప్రకటించి కొన్నిరోజులకు తానే బయటికి వచ్చేసిన పార్టీ కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ నేత మహేష్ గౌడ మొదటి ఎన్నికల్లోనే రాణిబెన్నూరు సీటు గెలిచారు

… సీఎం సిద్ధరామయ్య రెండు సీట్లలో పోటీచేస్తే చాముండేశ్వరిలో జేడీఎస్ అభ్యర్థి జీడీ దేవెగౌడ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు.

… సినీ నటుడు సాయికుమార్ బీజేపీ తరపున బాగేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు. అంతకంటే విశేషం ఏంటంటే.. సాయికుమార్ కు వచ్చిన ఓట్లు కూడా 4వేలు మాత్రమే కావటం మరింత ఘోరం.

… నోటాకు 3లక్షల ఓట్లు పడ్డాయి. ఇది పోలైన ఓట్లలో 0.9 శాతం. ఈ ఎన్నికల్లో బీఎస్పీ 0.3 శాతం, ఏఐఎంఈపీ 0.3 శాతం, బీపీజేపీ 0.2 శాతం,

స్వరాజ్ పార్టీ 0.2 శాతం, సీపీఎం 0.2 శాతం, కేపీజేపీ 0.2 శాతం ఓట్లు సాధించాయి.

… ఆరు పార్టీలతో పోలిస్తే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ పార్టీల్లో ఏ మూడు పార్టీల ఓట్లన్నీ కలిపినా నోటా కంటే తక్కువే కావడం విశేషం.

… కర్ణాటకలో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి స్వతంత్రులు సరైన సీట్లు గెలవలేకపోయారు. పెద్ద పార్టీల మధ్య హోరాహోరీ పోరులో స్వతంత్రులు కొట్టుకుపోతే ముల్బగళ్ లో మాత్రం ఒక్క ఇండిపెండెంట్ గెలిచారు.

Advertisements

Leave a Reply