GST బుల్లెట్ రివ్యూ (18+)

ఒక పదిహేను రోజుల నుంచి టివి పెడితే ఒకటే గోల, గాడ్ సెక్స్ అండ్ ట్రూత్. రామ్ గోపాల్ వర్మ కూడా ఎప్పుడు లేనంత ఎగ్రేసివ్ గా ప్రమోట్ చేసాడు. ఎంత వ్యతిరేకత వచ్చినా నేను తీసిందే కరెక్ట్ అని నిలబడ్డాడు.ఇది పోర్న్ కాదు, పోర్న్ అని అర్ధం చేసుకుంటే నేనేం చెయ్యలేను అనేసాడు. దేవి లాంటి ఎవరన్నా ఇది తప్పు అని చెప్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేసాడు. కొన్ని చానల్స్ అయితే అబ్బాయిలని అమ్మాయిలని కూర్చోపెట్టి డిస్కషన్స్ చేసారు. రాం గోపాల్ వర్మ చాలా ప్రొటెక్ట్ చేసారు ఈ సినిమాని. ఎవరో ఒక రైటర్ వచ్చి అది నా కథ అంటే, అతని క్లైమ్స్ తప్పు అని లీగల్ నోటీస్ ఇచ్చారు. వర్మ కు కూడా లీగల్ నోతీస్లు వచ్చాయి. పోలీసు కేసులు ఫైల్ అయ్యాయి. ఇంత హైప్, ఇంత రచ్చ ఇదంతా ఒక 19:30 నిమిషాల షార్ట్ ఫిలిం కి,దీనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనికి రివ్యూ ఇద్దాం అని డిసైడ్ అయ్యాము. మా బుల్లెట్ రివ్యూ లో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

ముందు నుంచి చూస్తున్నట్టు మియా మాల్కొవా బావుంది

ఎం ఎం కీరవాణి అందించిన నేపధ్య సంగీతం బావుంది

కెమెరా వర్క్, లైటింగ్ పాటర్న్స్ బావున్నాయి

ఎం చెప్పాలి అనుకున్నారో స్పష్టత లేదు

గతం లో వచ్చిన ట్రైలర్ ఇంకాస్త లెంగ్త్ పెరిగినట్టు ఉంది

ఒక గదిలో రకరకాల యాంగిల్లో ఆ అమ్మాయి ని నగ్నం గా చూపించటం తప్పితే 19 నిమిషాల్లో ఏమి లేదు

ఏమి చూస్తున్నామో, ఎందుకు చూస్తున్నామో మనకే క్లారిటి ఉండదు.

 

ఓవరాల్ రాం గోపాల్ వర్మ చెప్పినంత గొప్పగా అనిపించదు, టెక్నికల్ గా బావున్నా, కంటెంట్ పరం గా ఏమి చెప్పాలి అనుకున్నారో క్లారిటి లేదు. ఒక వేళ అదే ఫిలాసఫీ ఐతే అర్ధం కాలేదు. డిజప్పాయింటెడ్.

రేటింగ్ : 2/5

రివ్యూ by AG

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here