లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ సింగర్ శ్రీనివాస్ అరెస్ట్

Advertisements

కేసిరాజు శ్రీనివాస్ అనగానే గుర్తు పట్టకపోవచ్చు కాని ఘజల్ శ్రీనివాస్ అంటే గుర్తు పాడుతారు. ఎక్కువ బాషలలో పాటలు పాడినందుకు ఈయన పేరు మీద గిన్నిస్ రికార్డ్ కూడా ఉందండోయ్. ఈయన్ని ఈ రోజు పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీనివాస్ తనను గత కొద్ది కాలం గా లైంగికం గా వేదిస్తున్నాడని ఒక వెబ్ రేడియో జాకీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారం గా పోలీసులు శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు.

ఘజల్ శ్రీనివాస్ తనకి సంవత్సర కాలం గా తెలుసని, అప్పటి నుంచి ఆయన తనతో మాట్లాడుతూ ఉండేవారని, ఈ మధ్య కాలం లో అసభ్యకరం గా మాట్లాడటంతో పాటు, తన ఫోటోలు పంపమని వేధిస్తున్నారని ఆలయవాణి అనే వెబ్ రేడియో జాకీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం గా చర్యలు తీసుకున్నారు. సమైఖ్యాంధ్ర ఉద్యమ సమయంలో ఉద్యమ గీతాలు ఆలపిస్తూ బాగా పాపులర్ అయిన శ్రీనివాస్ జాతీయ,అంతర్జాతీయ ప్రదర్శనలు ఎన్నో ఇచ్చారు.  గత డిసెంబర్ 29న పూర్తి ఆధారాలతో పోలీసు స్టేషన్ కి వెళ్ళిన బాధితురాలు ఘజల్ శ్రీనివాస్ దురాగతాల గురించి పోలీసులకి వివరించినట్టు తెల్సింది. ఆధారాలను సరి చుస్కున్న పోలీసులు ఈ రోజు ఉదయం ఆయన నివాసం నుంచి ఆయనను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు. ఈ కేసులో వాట్సాప్ చాట్ మెసేజెస్ కీలకం కానున్నట్టు సమాచారం. వేధింపుల తీవ్రతని బట్టి శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.

Advertisements

Leave a Reply