EXCLUSIVE : గాయత్రి బుల్లెట్ రివ్యూ

చాలా కాలం తర్వాత విలక్షణ నటుడు మోహన్ బాబు నటించిన చిత్రం గాయత్రి. మోహన్ బాబు రెండు పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మంచి విష్ణు.శ్రియ ముఖ్య పాత్రల్లో కనిపించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి, మదన్ దర్శకుడు. మోహన్ బాబు కూతురు గా నిఖిలా విమల్ నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది,స్పెషల్ షో ఇప్పుడే పూర్తీ అయ్యింది. ఈ గాయత్రి ఎలా ఉందొ బుల్లెట్ రివ్యు లో చూద్దాం.

ఒక చిన్న మాట : బుల్లెట్ రివ్యూ ఏంటంటే, మా సినిమా పరిజ్ఞానం మీద మీ ముందు విజ్ఞాన ప్రదర్శన చేసే అవసరం లేదు అని నమ్ముతున్నాం. ఎంత కష్టపడి అనలైజ్ చేసి రాసినా మీరు చదివేది ఫైనల్ వర్డిక్ట్, చూసేది మేమిచ్చె రేటింగ్. కాబట్టి సింపుల్ గా సుత్తి లేకుండా బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేస్తాం. బావుందో బాలేదో చెప్తే చూడాలో వద్దో మీరు డిసైడ్ అవుతారని మా నమ్మకం.

గాయత్రి సినిమా లో మోహన్ బాబు చేసిన రెండు పాత్రలు బాగున్నాయి. ముఖ్యంగా గాయత్రి పటేల్ (విలన్) పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే గాయత్రి పటేల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మంచు విష్ణు,. శ్రియ చేసిన రోల్స్ బాగున్నాయి. వీరి నటన ప్రేక్షకులకు కంటతడి తెప్పిస్తాయి.

మోహన్ బాబు కూతురి పాత్రలో నటించిన నికిల విమల్ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ లో తను చేసిన పర్ఫామెన్స్ బాగుంది.

ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ట్విస్ట్ బాగుంది. తరువాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది.

ఒక నువ్వు ఒక నేను అనే పాట తెరపై బాగుంది. నేపద్య సంగీతం సినిమాకు మరింత బలం కానుంది. ఈ విషయంలో తమన్ ను మెచ్చుకోక తప్పాదు.

ఇంటరెస్టింగ్ కథనంతో దర్శకుడు సినిమాను బాగా తెరకెక్కించాడు. మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. డైమండ్ రత్నబాబు మాటలు తూటాల్లా పేలాయి.

ఓవరాల్ గా చుస్తే భారి అంచనాలు లేకుండా వస్తున్న గాయత్రి సినిమా ప్రేక్షకులకు నిరాశ కలిగించాదు. మంచి సినిమా చుసామనే ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వస్తారు.చాలా కాలం లో మోహన్ బాబు నుంచి మంచి సినిమా ఇది. చుస్తే నిరాశ చెందరు.

రేటింగ్ : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here